Showing posts with label Tollywood cinema news. Show all posts
Showing posts with label Tollywood cinema news. Show all posts

Tuesday, December 26, 2017

Tollywood 2017: Star Of The Year Natural Star Nani



In Any Field Hard work always pays! One has to agree that it is true looking at Nani’s recent success at the box office.
After going through tough time during Paisa and Aaha Kalyanam phase, Nani has bounced back with Bhale Bhale Magadivoy and there’s no looking back after that.
A series of successful films earned him the trust of filmgoers that blindly trust his choices at the moment.
Nani had a fabulous 2017 where his market has nearly doubled in no time. Nenu Local turned out to be the biggest hit (barring Eega) in his career so far. He followed it up with Ninnu Kori that also became a super hit.
Now with MCA Nani is once again stamping his authority over the box office with fantastic show at the box office.
The film has already crossed Rs. 20 crore mark worldwide and is more than likely to be a safe venture for everyone involved.
While other heroes are struggling to find a single success, Nani has been on a roll from a longtime.
He is undoubtedly the star of the year with hundred percent strike rate!

ఫస్ట్ లుక్ కాదు.. నేరుగా టీజర్!

సీక్రెట్ అంటూ ఈమధ్య ఓ ప్రకటన చేశాడు బన్నీ. తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ ను జనవరి 1న విడుదల చేయబోతున్నట్టు తెలిపాడు. ఫస్ట్ ఇంపాక్ట్ అంటే ఏంటనేది అప్పట్లో చాలామందికి అర్థంకాలేదు. ఫస్ట్ లుక్ వస్తోందా లేక టీజర్ వస్తుందా అనే అనుమానాలు ఉండేవి. ఫైనల్ గా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
బన్నీ కొత్త సినిమాకు సంబంధించి టీజర్ వస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్ కింద 80సెకెన్ల టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం దీని వర్క్ నడుస్తోంది. ఇందులో బన్నీ మాత్రమే కనిపిస్తాడు. డైలాగ్ కూడా ఉండదు.
సినిమా ఏ జానర్ కు చెందుతుంది.. అందులో బన్నీ ఎలా ఉండబోతున్నాడనే అంశాలపైనే ఫోకస్ పెడుతూ ఈ టీజర్ ను కట్ చేస్తున్నారు. నిజానికి యూనిట్ దృష్టిలో ఇది టీజర్ కూడా కాదు. అసలైన టీజర్ కు సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ లో భాగంగా విడుదల చేయబోతున్నారు. అందుకే దీనికి 'ఫస్ట్ ఇంపాక్ట్' అనే పేరుపెట్టారు.
వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ కోసం ఫారిన్ ట్రైనర్ ను హైదరాబాద్ కు రప్పించి మరీ మేకోవర్ అయ్యారట. హెయిర్ స్టయిల్ లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఆ లుక్ ను మాత్రమే 'ఫస్ట్ ఇంపాక్ట్' కింద రిలీజ్ చేయబోతున్నారు.

ఈసారి అన్నీ అక్కడే

న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు, తారలంతా విదేశాలకు చెక్కేస్తుంటారు. ఎవరు ఏ దేశం వెళ్తున్నారో కూడా అర్థం కాదు. ఈ 4-5రోజులు ఎవ్వరూ కనిపించారు. ఈ ఏడాది స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లకైతే ఈ ఎంజాయ్ మెంట్ ఇంకాస్త ఎక్కువే. ఈ లిస్ట్ లో అందరికంటే ముందుంది పూజా హెగ్డే.
దువ్వాడజగన్నాధమ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే.. ఈసారి నూతన సంవత్సర వేడుకల కోసం బ్రిటన్ ను సెలక్ట్ చేసుకుంది. మాంచెస్టర్ లో న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసి, తన నిర్మాతలకు సమాచారం అందించింది పూజా.
ప్రస్తుతం ఈ బ్యూటీ, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యం అనే సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత కొత్త ఏడాదిలో మహేష్ బాబు సరసన నటించనుంది పూజా హెగ్డే.

ఆ నాలుగు నిమిషాలు ఏమై వుంటుంది?

విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ యాక్టర్ కామియో రోల్ వేసారు అంటే అక్కడ రెండు పాయింట్లు వుంటాయి. అయితే మొహమాటానికి. లేదా కాస్తయినా ఇంపార్టెన్స్ వున్న పాత్ర కావడం. ప్రేమమ్ సినిమాలో ఆ మధ్య జస్ట్ వన్ టు టూ మినిట్ కామియో రోల్ చేసాడు. తన మేనల్లుడు నాగ చైతన్య సినిమా కాబట్టి. పైగా అక్కడ పాత్ర కూడా అలాగే సెట్ అయింది.
ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ కాంబోలోని అజ్ఞాతవాసిలోని ఓ సీన్ లో వెంకీ కామియో రోల్ చేసాడు. జస్ట్ నాలుగు నిమిషాల పాత్ర అది. డైలాగులు వున్నాయి. డబ్బింగ్ కూడా చెప్పాడు వెంకీ. అయితే త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ ఏదో సినిమాకు బజ్ కోసమో, ప్లస్ కావడం కోసమో వెంకీని ఓ కామియో రోల్ లోకి తీసుకురాడు. సమ్ థింగ్ వుండి వుండాలి. ఆ సమ్ థింగ్ ఏమిటన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్.
అయితే వెంకీ పాత్ర కథతో సంబంధం వున్నది కాదనీ, జస్ట్ పాస్ ఆన్ కామియో క్యారెక్టర్ మాత్రమే అని వినిపిస్తోంది. కానీ తళుక్కున మెరిసే ప్రాధాన్యత వుంటుందని, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగు ఒకటి పడుతుందని తెలుస్తోంది. మల్లీశ్వరి తరువాత మళ్లీ ఇన్నాళ్లకు వెంకీ నోట త్రివిక్రమ్ పంచ్.. ఎలా వుంటుందో మరి.

ఫ్యాన్స్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు

చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను ఇబ్బందిపెట్టిన బన్నీ.. ఈసారి ఏకంగా తన ఫ్యాన్స్ కే వార్నింగ్ ఇచ్చాడు. 'ఒక్క క్షణం' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. అభిమానులపై అసహనం వ్యక్తంచేశాడు. వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు.
"ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం ఎదురు మాట్లాడ్డం సంస్కారం కాదు. మీరు ఎంతయినా అరవండి. ఫంక్షన్ పెట్టేదే మీరు అరుస్తారని, కానీ ఓ మనిషి మాట్లాడేటప్పుడు మాత్రం కాదు. నేను మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ల పేరు ఎత్తిమరీ చెబుతా. మీకు ఆ సంస్కారం ఉండాలి". ఇలా ఫ్యాన్స్ కు చిన్న క్లాస్ పీకాడు బన్నీ.
ప్యాన్స్ కంట్రోల్ లో లేకపోతే నాకు కోపం వచ్చేస్తుందంటున్నాడు బన్నీ. ఎవరైనా వాళ్ల ఫీలింగ్ చెప్పుకునేటప్పుడు అడ్డం పడకూడదంటున్నాడు.
"మీ సంతోషం నాకు అర్థమౌతోంది. కానీ మాట్లాడేటప్పుడు అరుస్తుంటే నేను హర్ట్ అయ్యాను. కొంచెం కోప్పడ్డాను. ఏవీ మనసులో పెట్టుకోవద్దు. ఇది ఎప్పట్నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది." అన్నాడు బన్నీ.
బన్నీ ఇలా రెచ్చిపోవడంతో పక్కనే ఉన్న అల్లు శిరీష్ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. "నా పేరు సూర్య" సినిమాలో సూర్య క్యారెక్టర్ ఇలా మాట్లాడుతోందని.. బన్నీ కాదని కవర్ చేశాడు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. బన్నీ అరవొద్దని వార్నింగ్ ఇస్తుంటే ఫ్యాన్స్ మరింత అరిచి అతడ్ని ఇరిటేట్ చేశారు.

Friday, December 22, 2017

వినాయక్.. నాయక్-2 తీస్తున్నాడా?

వి.వి.వినాయక్ చివరగా తీసిన ‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్. అయినప్పటికీ దీని తర్వాత అతడితో పని చేయడానికి పెద్ద స్టార్లెవరూ ముందుకు రాలేదు. పెద్ద హీరోల కోసం చూసి చూసి.. చివరికి సాయిధరమ్ తేజ్‌తో సర్దుకుపోయాడు. ‘ఖైదీ నంబర్ 150’ సక్సెస్ క్రెడిట్లో వినాయక్‌కు పెద్దగా క్రెడిట్ ఏమీ రాలేదన్నది వాస్తవం. అది రీమేక్.. పైగా చిరు రీఎంట్రీ మేనియా దానికి కలిసొచ్చింది.

దాన్ని పక్కన పెట్టేసి చూస్తే గత కొన్నేళ్లలో వినాయక్‌కు సరైన సక్సెస్ లేదు. ‘ఖైదీ..’ కంటే ముందు తీసిన ‘అఖిల్’ పెద్ద డిజాస్టర్. దాని కంటే ముందు వచ్చిన ‘అల్లుడు శీను’ యావరేజ్. అంతకంటే ముందు వచ్చిన ‘నాయక్’ ఆ సమయానికి బాగానే ఆడింది. ఐతే ‘నాయక్’ తరహా సినిమాలు ఇప్పుడు తీస్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. ఆ తరహా ఫార్ములా.. రొటీన్ సినిమాలు ఇప్పుడు వర్కవుటయ్యే పరిస్థితి లేదు.

ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథలకు పట్టం కడుతుతున్నారు. భిన్నమైన సినిమాలు కోరుకుటున్నారు. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా వినాయక్ తీయగలడా అన్న సందేహాలున్నాయి. ఐతే తేజు-వినాయక్ సినిమాకు అనుకుంటున్న టైటిల్.. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఒక లుక్ చూస్తే మాత్రం ఇదేమైనా ‘నాయక్-2’నా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ‘ధర్మాభాయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ టైటిల్ చూస్తేనే అన్యాయాన్ని ఎదిరిస్తూ జనాల పక్షాన నిలబడే ఒక నాయకుడి కథ అనిపిస్తోంది. పైగా ‘నాయక్’ సినిమాలో చరణ్ లుక్‌ను తలపించేలా తేజు సోఫాలో కూర్చుని ఒక స్టిల్ బయటికి వచ్చింది.

ఈ టైటిల్.. ఆ లుక్ చూశాక.. వినాయక్ కొత్తగా ఏమీ ట్రై చేయట్లేదని.. తనకు అలవాటైన ఫార్ములా బాటలో సాగిపోతున్నాడని సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహాలే నిజమైతే మాత్రం కష్టమే. తేజు అసలే వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి టైంలో ఒక రొటీన్ సినిమాతో వస్తే మాత్రం అంతే సంగతులు. చూద్దాం మరి.. వినాయక్ ఏం చేశాడో?

మెగా ఫ్యాన్స్ కి ఒక్క క్షణం బిస్కెట్

ఫ్యామిలీలో యాక్టర్స్ అందరినీ కలిపితే.. ఓ క్రికెట్ టీం అయిపోతారు. ఇది ఓ మెగా హీరో చెప్పిన మాట. ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు. అయితే.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరికీ ఒకే రకమైన సపోర్ట్ లభిస్తుందని అనుకోవడం సరి కాదు. పవర్ స్టార్ నుంచి అల్లు శిరీష్ వరకూ అనేక మంది ఇండస్ట్రీలోకి వస్తే.. ఎవరి రేంజ్ వారికి ఏర్పడింది. వీరిలో అల్లు శిరీష్ ఎక్కువగా తిప్పలు పడాల్సి వచ్చింది. సినిమాలు ఫెయిల్ అవడం పక్కన పెడితే.. విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిన ఏకైక హీరో శిరీష్. అయితే.. గతేడాది శ్రీరస్తు శుభమస్తు సక్సెస్ సాధించి.. గాడిన పడ్డాడనే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ నుంచి ఇప్పటివరకూ అల్లు శిరీష్ కు ఫుల్ సపోర్ట్ అందడం లేదు. అందుకే ఈ సారి మెగా ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునేందుకు మంచి ఐడియానే వేసినట్లుగా ఉంది ఒక్క క్షణం టీం. ఇవాళ జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. మెగాభిమానుల చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ చేయిస్తారట. ఇలా అభిమానులతో ట్రైలర్ లాంఛ్ చేయడం కొత్త ఆలోచనే అయినా.. ఇందులో మెగా ఫ్యాన్స్ ను ఆకర్షించాలనే పాయింటే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ మెగా బిస్కెట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చెప్పలేం కానీ.. ఒక్క క్షణం మూవీ మాత్రం టీజర్ తో బాగానే ఆకట్టుకుంది. ట్రైలర్ కూడా ఇదే స్థాయిలో ఉంటే.. మెగా ఫ్యాన్స్ అండ లభిస్తే.. వసూళ్లు అదిరిపోవడం ఖాయం.

హలో చిరంజీవి.. ఏంటిది?

కొన్ని సన్నివేశాలు చూస్తే ఏడుపొచ్చింది. ఆపుకోలేక ఏడ్చేశాను.
అఖిల్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు.
హలో సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి యూనిట్ వాళ్లు ఇలా చెప్పుకుంటే ఫర్వాలేదు. ప్రమోషన్ లో భాగంగా ఎన్నయినా చెప్పొచ్చు. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి హలో గురించి చెప్పిన మాటలివి. ఈ ప్రాజెక్టుతో చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా మాత్రమే వచ్చారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెబితే సరిపోతుంది. కానీ అంతకుమించి మాట్లాడారు చిరు. 
ఈమధ్య కాలంలో ఇతర సినిమాల గురించి చిరంజీవి ఇంతలా మాట్లాడింది లేదు. హలోకు మాత్రం చాలా హైప్ ఇచ్చారు. పొద్దున్న సినిమా చూసి సాయంత్రం ఈవెంట్ కు రావడంతో హలో ఎఫెక్ట్ చిరంజీవిపై గట్టిగా పడిందనుకోవాలా... లేక నిజంగానే హలో సినిమా బాగుందనుకోవాలా..? ఏ విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
ప్రస్తుతానికి ఆడియన్స్ దృష్టి హలో సినిమాతో పాటు చిరంజీవిపై కూడా పడింది. రేపు రిలీజ్ కానున్న హలో సినిమా చిరు చెప్పిన రేంజ్ లో లేకపోతే ఆడియన్స్ కు చిరంజీవి కచ్చితంగా టార్గెట్ అవుతారు. మెగాస్టార్ పై కామెంట్స్ తప్పవు. 
గతంలో కృష్ణ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆగడు సినిమాను వందకోట్ల సినిమాగా చెప్పుకొచ్చారు కృష్ణ. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆగడు అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పట్లో అంతా కృష్ణ జడ్జిమెంట్ పై విమర్శలు చేశారు. కాకపోతే కొడుకు సినిమాపై కృష్ణకు ఆమాత్రం ప్రేమ ఉంటుందని అంతా సర్దిచెప్పుకున్నారు. 
కానీ చిరంజీవి విషయానికొస్తే, ఇది అతడి కొడుకు చిత్రం కాదు. కనీసం మెగా కాంపౌండ్ మూవీ కూడా కాదు. అలాంటి సినిమాను రిలీజ్ కు ముందే ఆకాశానికెత్తేశారు చిరు. ఇప్పుడా మూవీ రిజల్ట్ కోసం అక్కినేని ఫ్యామిలీతో పాటు చిరంజీవి కూడా ఆత్రంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

రవితేజకి షాక్ ఇచ్చిన సూర్య

రాజా ది గ్రేట్ సినిమాతో రికవర్ అయిన మాస్ మహారాజ రవితేజ ఇక స్పీడ్ స్పీడ్ గా సినిమాలను ఒకే చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే రెగ్యులర్ కథలు కాకుండా కథ కొత్తగా ఉంటేనే ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ లో రవితేజ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో రవితేజ ఒక రీమేక్ కథను సెట్స్ పైకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాడు.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన స్పెషల్ 26 అనే సినిమా తెలుగులో రవితేజ చేద్దామని అనుకున్నాడు. కొంతమంది దర్శకులతో చర్చలు కూడా జరిపాడు. అయితే సెట్ అవుతోంది అనుకున్న సమయంలో సూర్య అదే కథతో తెలుగు తమిళ్ లో వస్తున్నట్లు తెలిసింది. 2013లో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 ఆదారంగా చేసుకొనే ''గ్యాంగ్'' సినిమా తెరకెక్కిందట. మొన్నటివరకు ఈ విషయాన్ని దాచి ఉంచిన సూర్య అండ్ టీమ్.. నిన్న దర్శకుడు విఘ్నేష్ శివన్ ద్వారా నిజాన్ని చెప్పేసింది. మనోడు ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఆ సినిమాను బేస్ చేసుకునే ఈ కథ అల్లినట్లు.. అలాగే రైట్స్ కూడా కొనుక్కున్నట్లు చెప్పాడు.

ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో రవితేజ షాక్ అయ్యాడట.  ఎలాగైతే ఏంటి తెలిసింది కదా అని సెట్స్ పైకి తీసుకెళ్లకముందే తెలిసిందని ఊపిరి పీల్చుకున్నాడట. అయితే సూర్యా గ్యాంగ్ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి జనవరి 13న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.

Thursday, December 21, 2017

కుమారిని పక్కనెట్టి కాంబో అంటే ఎట్టా?

సినిమాలు చేయడంలో రాజ్ తరుణ్ స్పీడ్ బాగానే ఉంటుంది. ఓ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలను కూడా రెడీ చేసేయగల ట్యాలెంట్.. జోష్ ఉన్న హీరో ఇతడు. ఇప్పుడు ఒకే సారి రెండు సినిమాలను విడుదలకు రెడీ చేసేశాడంటే.. ఈ కుర్రాడి స్పీడ్ అర్ధమవుతుంది. మరోవైపు రాజ్ తరుణ్ తన నెక్ట్స్ మూవీపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశాడట.

ఇప్పటివరకూ రాజ్ తరుణ్ కెరీర్ బెస్ట్ అయిన కుమారి 21ఎఫ్ మూవీ కాంబోని రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది. కాంబో అంటే.. మొత్తం టీం అంతా అనుకోకండి. కుమారి చిత్రాన్ని తీసిన పల్నాటి సూర్యప్రతాప్ తో .. తన మరుసటి చిత్రం ఖాయం చేసుకున్నాడట రాజ్ తరుణ్. రవితేజతో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాత రామ్ తాళ్లూరి.. ఈ కుమారి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రాన్ని కూడా నిర్మిస్తారట. అంతవరకూ ఓకే కానీ.. అసలు కుమారి21ఎఫ్ అంటే.. ఆ చిత్రానికి తొలి ఆకర్షణ సుకుమార్ రైటింగ్స్ అనే ట్యాగ్ లైన్. అది వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి.. నెక్ట్స్ సంగతి చెప్పుకుంటే.. కుమారి పాత్రలో మెప్పించిన హెబ్బా పటేల్.

హెబ్బా పటేల్ నే మళ్లీ తీసుకుంటారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. అప్పుడే కుమారి కాంబినేషన్ అంటే ఎట్టాగబ్బా అనుకుంటున్నారు సినీ జనాలు. అఫ్ కోర్స్.. రాజ్ తరుణ్ తో సినిమాలకు హెబ్బా ఎలాగూ ఉత్సాహం చూపిస్తుంది. పైగా ఈ మధ్య చిక్కేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. సో కొత్తగా మారిన కుమారిని పట్టుకొచ్చి హీరోయిన్ అనేస్తే మాత్రం.. మళ్లీ కుమారి 21ఎఫ్ రేంజ్ క్రేజ్ వచ్చేయవచ్చు.

Megakkineni Bonding Became Talk Of Town

Last night it was a cheerful environment at 'Hello' pre-release event as we have seen Megastar Chiranjeevi and Ram Charan gracing as Chief guests for Akhil's "Hello", produced by Dad Nagarjuna. And the Mega-Akkineni bonding, ala megakkineni's, have simply stunned everyone at the event and also the watchers on TV.
When Akhil said, "My Pedananna Chiranjeevi garu, my Peddanna Charan", it's just so astounding to hear. And then, Nagarjuna stated that he liked it when Akhil called Charan as a big brother. "Chiranjeevi garu and I have a big age gap, but still we are very good friends. Our hearts are in resonance. And now Charan and Akhil, it's too good", Nag said, adding more cement to strengthen the bond.

And then Chiranjeevi's turn came in. "Whenever Akhil comes to our home, my wife says even we should have planned for a younger son. But I feel Akhil is our younger son", he said, breaking the crowds into that amazing cheers. And Ram Charan stated that there is nothing he couldn't talk about when the likes of Chiranjeevi and Nagarjuna are present at a venue.

Later Naga Chaitanya also added that Chiranjeevi is the inspiration for heroes of not just one generation but all generations. And Samantha joined the chorus by thanking Megastar's fans who have come there. Earlier also we have seen Chiru turning up on Meelo Evaru Koteeswarudu as a guest when Nag is the host and later Akkinenis joining as guests when Megastar moved to the hot seat.

This camaraderie between Akkinenis and Mega family is anticipated but people haven't expected that this would be of such divine proportion. Generally, we see a lot of rival camps and it seems like Tollywood's big families are blurring such thoughts which fans usually have. Hope this bonding extends to films also and some mega-akkineni multi starers come up in the future.

Wednesday, December 20, 2017

ఎన్టీఆర్ కు ఆ ఆపరేషన్?

ఎన్టీఆర్ కు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగింది. అయిదు కిలోల ఫ్యాట్ ను తొలగించారు. ఇదీ ట్విట్టర్ లో కనిపిస్తున్న వార్త. ఎంత వరకు నిజం అన్నది తెలియదు. నిజం కాదని ఎన్టీఆర్ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. యమదొంగ సినిమా టైమ్ నుంచి ఎన్టీఆర్ ఫిట్ నెస్ బాడీతో కనిపిస్తూ వస్తున్నారు. టెంపర్ సినిమాలో అయితే సిక్స్ ప్యాక్ తో కనిపించారు కూడా.
అయితే జై లవకుశ సినిమా కోసం మూడు పాత్రలు పోషించాల్సి రావడం, దాంట్లో రావణ పాత్ర కోసం వైవిధ్యం చూపించాల్సి రావడంతో ఎన్టీఆర్ ఫిజిక్ కొంచెం మారింది. అందువల్లను, రాబోయే త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ను ట్రయ్ చేయాలని అనుకోవడంతో, మళ్లీ మాంచి ఫిట్ నెస్ తో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని వార్తలు వినవచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ బయట కనిపించలేదు. నార్త్ లో ఆయన ఫ్రెండ్స్ ఫంక్షన్ కు వెళ్లారని యూనిట్ అంటోంది. మరి ఇవన్నీ కలిసి ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ పుట్టించారో, ఇంకేమైనా వుందో కానీ, ఎన్టీఆర్ కు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగిందని, అయిదు కిలోల ఫ్యాట్ తగ్గించారని ట్విట్టర్ లో ఒకటి రెండు ట్వీట్ లు కనిపించాయి. కానీ ఎన్టీఆర్ యూనిట్ వర్గాలు ఇవన్నీ కిట్టని వారి పని అని కొట్టి పారేసాయి.
Andhra news, Andhra Politics, Telangana news, Tollywood News, Bollywood telugu movie news, latest telugu movie news, movie photos, gossips, videos, review, telugu movie review,tollywood latest,movie trailers

పవన్ నట విశ్వరూపం చూస్తారు

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రసంగం
అభిమానులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి. ఒక్కరికి ఏమయినా కష్టం కలిగినా పవన్ కళ్యాణ్ ఫీలవుతారు. మనం అంతా పవన్ వెనుక వుండాలి. అలా వుండే వాళ్లలో ఒక్క నెంబర్ కూడా తగ్గకూడదు. అందుకే అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి.
ఇక, అజ్ఞాతవాసి సినిమా వెనుక ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అలాంటి మహానుభావుల్లో కొందరు ఈ వేదిక మీద వున్నారు. మణికంఠన్, ప్రకాష్, అనిరుధ్, బొమ్మన్ ఇరానీ, తనికెళ్ల భరణి ఇలా అందరికీ నా కృతజ్ఞతలు. వీళ్ల అందరి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. 
నాకు ఖర్చు ఎక్కువ. మా అమ్మ తిడుతూ వుండేది. ఇప్పుడు నిర్మాత తిట్టడంలేదు నా గడ్డం నెరసిపోయింది కాబట్టి. ఈ సినిమాకు నిర్మాత చినబాబు, ఆయన పక్కన వంశీ, పిడివి ప్రసాద్ కలిసి బోలెడు ఖర్చు చేసారు. పవన్ కళ్యాణ్ ఇటలీలో వుండగా రెండు నిమషాల్లో, ఫోన్ లో కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకె చేసారు. ఆ తరువాత నేనేం చెబితే అది చేసారు. అంతే తప్ప ఏమీ అడగలేదు.
ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపాన్ని చూస్తారు. అంతకన్నా ఆయన గురించి ఇంకేం చెప్పకూడదు. అమ్మ అంటే ఎంత ఇష్టం అయినా మనసులోనే వుంచుకుంటాం. మీరు అందరూ అనుకునే, ఆశించే ఉన్నత స్థాయికి పవన్ చేరుకుంటారని ఆశిస్తున్నాను.
బిఎన్ రెడ్డి దగ్గర నుంచి రాజమౌళి వరకు ఎందరో మహానుభావులు. వారందరికీ వందనాలు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జోహార్లు-పవన్ కళ్యాణ్

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో హీరో పవన్ కళ్యాణ్ చాలా చిత్ర, విచిత్రమైన ప్రసంగం చేసారు. ఆ మధ్య చాలా రాజకీయ ప్రసంగాలు చేసినపుడు ఇట్నుంచి అటు, అట్నించి ఇటు ఎలా జంప్ చేస్తూ మాట్లాడినట్లే పవన్ ఈ సభలోనూ మాట్లాడారు. ఆయన మాట్లాడిన చాలా వాక్యాలకు కర్త,కర్మ, క్రియ లాంటి పద్దతులు లేవు. ఒక పదానికి మరో పదానికి పొంతన లేదు. ఒక దానితో స్టార్ట్ చేసి, మరో దాంతో ఎండ్ చేసారు. 
భారత్ మాతాకీ జై అంటూ పొలిటికల్ సినిమాటిక్ గా ప్రసంగం స్టార్ట్ చేసిన పవన్ మధ్యలో వున్నట్లుండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు మళ్లారు. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు ఇస్తుంటారని, ఏదేదో అంటుంటారని, కానీ తనను చాలామంది ఒంటరి చేసేసినపుడు, పరాజయాల సమయంలో తనతో ఎవరూ లేనపుడు, త్రివిక్రమ్ అండగా నిలిచారని మొదలుపెట్టి, తెగ చెప్పుకువచ్చారు, తను చేయూత నిచ్చిన వాళ్లు, తాను అండగా నిలబడిన వాళ్లు తనతో వుండలేదు అని చెప్పారు.
తనను డిప్రెషన్ లోంచి త్రివిక్రమ్ నే బయటకు తీసుకువచ్చారని పవన్ వెల్లడించారు. త్రివిక్రమ్ కు తాను కాకపోతే, బోలెడు మంది హీరోలు దొరకుతారని అన్నారు. జల్సా హిట్ అయిందని, డబ్బులు వచ్చాయని, తనకు మరో మూడేళ్లకు కానీ తెలియదన్నారు.
ఎవర్నీ కోప్పడలేను కానీ, త్రివిక్రమ్ ను కొప్పడగలను అన్నారు. అంత సాన్నిహిత్యం వుందన్నారు. తనకు బలంగా అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్ అన్నారు. అందుకే ఆయనకు మనస్పూర్తిగా జోహార్లు అర్పిస్తున్నా అన్నారు. (బతికివున్నవాళ్లకు జోహార్లు అర్పించరు. పోయినవాళ్లకు తప్ప. పాపం పవన్ కు ఆ సంగతి తెలియదు అనుకోవాలి) ఇలా త్రివిక్రమ్ గురించి బోలెడు చెప్పిన తరువాత పవన్ మళ్లీ దారి తప్పారు. 
అంతకు ముందు త్రివిక్రమ్ ఏ విధంగా, ఎలా అయితే సినిమాలో టెక్నీషియన్లకు, నటులకు థాంక్స్ చెప్పారో దాదాపు అదే మళ్లీ పవన్ వల్లె వేసారు. పవన్ ప్రసంగంలో ఏమిటో ఏమిటో మాట్లాడారు. ఒక దశలో పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థంకాలేదు. ఓటమికి కుంగిపోను అంటారు. వైరాగ్యం వచ్చిందంటారు. కోట కట్టుకున్నా అంటారు.
మొత్తంమీద ఈసారి పవన్ స్పీచ్ లో, తన రాజకీయం, సేవా గుణం, దేశంపట్ల తన ఆవేదన చెప్పాలన్న తపన, తన మనిషి తివిక్రమ్ పై ఇటీవల వినిపిస్తున్న గుసగుసలకు సమాధానం చెప్పాలన్న ఆలోచన కనిపించాయి తప్ప, సరైన సమగ్ర ప్రసంగం మాత్రం చేయలేకపోయారు.

Andhra news, Andhra Politics, Telangana news, Tollywood News, Bollywood
telugu movie news, latest telugu movie news, movie photos, gossips, videos, review, telugu movie review,tollywood latest,movie trailers
 

Okka Kshanam Storm Subsided

'Okka Kshanam' teaser released a few days ago and it became the talk of the Tollywood.  Director VI Anand came up with an interesting teaser with 'parallel life' concept.  But AK Entertainments owner Anil Sunkara has bought the remake rights of a Korean movie titled 'Parallel Life' and produced a Telugu film '2 Memiddaram'.  The situation has lead to a copyrights issue.

There were reports in the media that Anil Sunkara served copyright notices to 'Okka Kshanam' team. There were even gossips in the film circles that he is trying to stop the release of 'Okka Kshanam'.  Meanwhile, Allu Sirish responded on this issue on behalf of 'Okka Kshanam' team.  He clarified that their film is a not copied and it is an original film.

Everybody was following the developments and they were curiously waiting for the Anil's reaction on this issue.  Finally, Anil opened on the copyright issue and said that he has spoken with the 'Okka Kshanam' director VI Anand.. producer Chakri Chigurupati.. all the issues were resolved.

He said that he listened to the concept and the whole story of 'Okka Kshanam' and he exuded confidence that the movie will become a super hit.   He added that he is eager to work with their film unit.  Allu Sirish immediately responded to Anil Sunkara's comments and he thanked him.  On the whole 'Okka Kshanam' issue has been resolved and the line has been cleared for the release.

చరణ్.. వాట్ ఏ ప్లాన్!!

ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే మినిమామ్ ఏడాది సమయం పడుతోంది. ఇక హీరో పరాజయల్లో ఉంటే మరో మంచి సినిమా తీయాలని టైమ్ ఎక్కువగానే తీసుకుంటాడు. కానీ ఎలాగైన మంచి అవుట్ ఫుట్ రావాలని కృషి చేస్తారు. విజయం దక్కినప్పుడు ఓ స్థాయి వరకు హ్యాపీగానే ఉంటుంది. కానీ డిజాస్టర్ అందితే ఆ సినిమా ఫెయిల్యూర్ మర్చిపోయావడానికి సమయం చాలానే పడుతుంది. ఆ తరహాలో ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోస్ విజయం కోసం చూస్తున్నారు.

ఇకపోతే సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరోలు కూడా ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఆలోచిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఆలస్యం అయినా సరే మంచి సినిమాతో రావాలని నెక్స్ట్ మూడేళ్ళ వరకు కొన్ని సినిమాలతోనే ప్లాన్ చేసుకున్నాడు. సమయాన్ని బట్టి సినిమాలను చేయాలని అనుకుంటున్నాడు. 2016 లో ధృవ సినిమాతో వచ్చిన చరణ్.. ఈ ఇయర్ ని ఫైనల్ గా మిస్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా 2018 మార్చ్ లో రిలీజ్ కానుంది.

ఇక ఆ తర్వాత రామ్ చరణ్ బోయపాటి తో ఒక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇక ఆ తరువాత రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ తో నటించడానికి  ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 2018 మే - జూన్ లో స్టార్ట్ కావచ్చు అని తెలుస్తోంది. ఒక వేళ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అయితే చరణ్ మరో స్టార్ డైరెక్టర్ తో రెడీగా స్టోరీని సెట్ చేసుకున్నట్లు టాక్. ఇక కొరటాల శివతో కూడా నెక్స్ట్ ఇయర్ లొనే పట్టాలెక్కించనున్నాడని టాక్.

మొత్తానికి చరణ్ తన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ 3 ఇయర్స్  వరకు చేతినిండా సినిమాలను సెట్ చేసుకున్నాడు. మరీ ఈ సినిమాలతో చరణ్ తన మార్కెట్ ని ఎంతవరకు పెంచుకుంటాడో చూడాలి.

Tuesday, December 19, 2017

రకుల్ ప్రీత్ దాగుడుమూతలు

పక్కా కమర్షియల్ సినిమాలు తీసిన హరీష్ శంకర్ రూటు మార్చానని ఇంతకుముందే చెప్పాడు. దాగుడుమూతలు అనే టైటిల్ తో డిఫరెంట్ లవ్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు. ఈ మూవీకి లొకేషన్లు ఫిక్స్ చేసేందుకు అమెరికా కూడా వెళ్లొచ్చాడు. ఈ మల్టీస్టారర్ మూవీలో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటిస్తారనే విషయాన్ని నిర్మాత దిల్ రాజు తాజాగా నిర్థారించాడు.
ఇప్పుడీ సినిమా కోసం హీరోయిన్లను ఫిక్స్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే రకుల్ ను కలిసి స్టోరీలైన్ వినిపించాడట హరీష్ శంకర్.  ప్రస్తుతం సినిమాలకు నెల రోజులు గ్యాప్ ఇచ్చిన రకుల్.. వచ్చే ఏడాది 'దాగుడుమూతలు' ప్రాజెక్టుకు కాల్షీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
శర్వానంద్ లేదా నితిన్ లో ఎవరి సరసన రకుల్ నటిస్తుందనే విషయంపై క్లారిటీ లేదు. రకుల్ ఫిక్స్ అయిన తర్వాత మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు ప్రారంభిస్తారట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

కీర్తితో విడాకులు.. ఎందుకో చెప్పాడు

‘తొలి ప్రేమ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన తెలుగమ్మాయి కీర్తి రెడ్డికి.. నాగార్జున మేనల్లుడు సుమంత్ కు పెళ్లి జరిగినపుడు వీళ్ల జంట చూడముచ్చటగా అనిపించింది. నాగార్జున-అమల లాగా ఇది మరో మంచి జంట అవుతుందని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా రెండేళ్లు తిరిగేసరికే వీళ్ల జంట విడిపోయింది. విడాకులు తీసుకుంది. ఐతే సుమంత్-కీర్తి విడిపోవడానికి సరైన కారణాలేంటన్నది ఇప్పటి వరకు తెలియలేదు. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు సుమంత్. తమ బంధం ఏడాదిన్నర మాత్రమే నిలిచిందని.. ఆ ఏడాదిన్నరలో తమ ఇద్దరి వ్యక్తిత్వాలు.. జీవితాలు పూర్తి భిన్నమని తమకు అర్థమైందని సుమంత్ తెలిపాడు.

తామిద్దరం ఎంతో కాలం కలిసి ఉండలేమని తమకు అర్థం కావడంతో ఉమ్మడి అంగీకారంతో.. సుహృద్భావ వాతావరణంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నామని సుమంత్ తెలిపాడు. కీర్తి తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉందని.. అది తనకు కూడా ఆనందాన్నిచ్చే విషయమని సుమంత్ తెలిపాడు. కీర్తితో తాను ఇప్పటికీ టచ్ లో ఉన్నానని.. అప్పుడప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడుతుంటానని.. కీర్తి కుటుంబం  తననెంతగానో గౌరవిస్తుందని సుమంత్ తెలిపాడు. చివరగా తన తాత ఏఎన్నార్ చనిపోయినపుడు కీర్తి ఇక్కడికి వచ్చి వెళ్లిందని సుమంత్ తెలిపాడు. తన విడాకుల విషయంలో తన మావయ్య నాగార్జున పాత్ర ఉన్నట్లు వచ్చిన ఊహాగానాల్ని అతను కొట్టిపారేశాడు.

అక్కినేని కుర్రోడిది మామూలు కష్టం కాదు

హీరోగా తన తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యేసరికి మొత్తం తన కాన్ఫిడెన్స్ అంతా పోయిందని ఇంతకముందే చెప్పుకొచ్చాడు అఖిల్. అతడి కెరీర్ కు ‘హలో’ ఇప్పుడెంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్రమ్ కుమార్ ఈ సినిమాను తీయడంతో మంచి ఫలితమే దక్కుతుందని అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. దీని ప్రోమోలు కూడా జనాల్ని బాగానే ఆకట్టుకున్నాయి.

ఐతే కంటెంట్ ఎంత బలంగా ఉన్నా.. ముందు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కీలకం. అందుకే ‘హలో’ టీం అగ్రెసివ్ ప్రమోషన్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు అఖిల్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. మొన్న విశాఖపట్నానికి వెళ్లాడు. ఆడియో వేడుకలో పాట పాడాడు.. డ్యాన్స్ చేశాడు.. ఇంకా చాలా హంగామానే చేశాడు అఖిల్. ఆ తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే అమెరికాకు వెళ్లాడు. అక్కడ మూణ్నాలుగు లొకేషన్లకు తిరిగాడు. ప్రతి చోటా డ్యాన్సులేశాడు. పాటలు పాడాడు. ఇందుకోసం రిహార్సల్స్ విషయంలోనూ చాలా కష్టపడ్డాడు.

ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి నేరుగా హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నాడు. బుధవారం జరగబోయే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ ఈవెంట్ రొటీన్ గా ఉండదట. ఇందులోనూ అఖిల్ పాట.. ఆట ఉంటుందట. చిరు ముందు పెర్ఫామెన్స్ అంటే చిన్న విషయం కాదు. అందుకోసం అఖిల్ రేపు ఉదయమంతా రిహార్సల్స్ చేస్తాడట. తర్వాత లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తాడట. మొత్తానికి తన సినిమాను ప్రమోట్ చేసే విషయంలో అఖిల్ కష్టం మామూలుగా లేదు. అతడి ఎనర్జీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Rumors about Personal Life Pained Me: Nani

Actor Nani, who is having best phase of his career, doesn’t seem to be entirely happy. The issue is not with his career.
The rising popularity and success has also brought him some headaches like rumours.
Nani is largely non-controversial star in Tollywood and until recently not much rumors were written about him.
"I am aware that being a star we have to face criticism and also have to handle gossiping. As long as they criticise or bitch about my movies or performances, my attitude, it is fine.
But the moment they write baseless news about personal life, it hurts deeply. I went through similar incident recently," Nani said.
He didn't elaborate much but the actor said a website wrote baseless personal gossip that hurt him badly. He requested media to maintain dignity while writing such news.
"Gossip is fine but not baseless rumors about personal lives," he asserts.
We assume that it is about linkup with actress Nivetha Thomas.