మళ్లీ రావా సినిమాతో కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంది ఆకాంక్ష సింగ్.
తెలుగు ప్రేక్షకులు కొందరికి ఆమె నచ్చింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్
ఏంటంటే.. ఆకాంక్షకు పెళ్లయిపోయింది. అవును.. పెళ్లయిన తర్వాత
సినిమాల్లోకొచ్చింది ఈ బ్యూటీ. అది కూడా రీసెంట్ మ్యారేజ్ కాదు.
"మళ్లీ రావా సినిమాలా నాది కూడా టీనేజ్ లవ్ స్టోరీనే. 16ఏళ్ల వయసుకే
నేను నా భర్తను కలిశాను. అప్పుడు అతడి వయసు 20ఏళ్లు. ప్రస్తుతం నాకు 27
సంవత్సరాలు." తనకు పెళ్లయి అటుఇటుగా ఏడేళ్లయిందని ప్రకటించింది ఆకాంక్ష.
పెళ్లయిన తర్వాతే యాక్టింగ్ కెరీర్ ఎంచుకుందట ఆకాంక్ష. భర్త సహకారంతో
డాన్స్, యాక్టింగ్ లో కోచింగ్ కూడా తీసుకుంది. తర్వాత చిన్నచిన్న ఆల్బమ్స్
లో నటించింది. అప్పుడే డైరక్టర్ గౌతమ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయంతోనే
ఆకాంక్షకు "మళ్లీ రావా" సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడట.
పెళ్లయిన విషయాన్ని దాచేసే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతోమంది. అలాంటిది
తనకు ఏడేళ్ల కిందటే పెళ్లయిపోయిందని ప్రకటించింది ఆకాంక్ష. పెళ్లయిన
హీరోయిన్లకు అవకాశాలు అంతగా రాని టాలీవుడ్ లో ఆకాంక్ష ఎలా రాణిస్తుందో
చూడాలి.



No comments:
Post a Comment