"మెంటల్" అనే పదంలోనే నెగెటివ్ సెన్స్ ఉంది. ఆ పదాన్ని వాడేది కూడా
నెగెటివ్ గానే. అలాంటి పదాన్ని తీసుకొచ్చి టైటిల్ గా పెడితే ఎలా ఉంటుంది.
పోనీ పెట్టిన తర్వాత టైటిల్ సింక్ అయిందో లేదో చూసుకోవాలి కదా. అలాంటి
ప్రయత్నాలేవీ జరిగినట్టు కనిపించలేదు. అందుకే మెంటల్ మదిలో టైటిల్ ఆడియన్స్
కు పెద్దగా కనెక్ట్ అవ్వలేదంటున్నారు ఆ సినిమా ప్రజెంటర్ సురేష్ బాబు.
"నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే.. ఈ సినిమాకు కరెక్ట్ టైటిల్ పెట్టామా
లేదా అనేది నా డౌట్. కథాపరంగా సినిమాకు ఇది రైట్ టైటిల్. కానీ ఆడియన్స్ ను
థియేటర్ కు రప్పించడానికి ఇది కరెక్ట్ టైటిలేనా అనేది ఆలోచించాల్సింది. నా
అభిప్రాయానికి అవును.. కాదు అనే సమాధానం అవసరం లేదు." మెంటల్ మదిలో టైటిల్
తనకు నచ్చలేదని పరోక్షంగా చెప్పేశారు సురేష్ బాబు.
ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నాలుగో వారంలోకి ప్రవేశించిందట. ఈ సందర్భంగా
ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు సురేష్ బాబు. అయితే మెంటల్
మదిలో సినిమా సక్సెస్ అయిందని, ఆ సినిమాను డైరక్ట్ చేసిన వివేక్ ఆత్రేయకు
నిర్మాతలు మరో సినిమా ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఆ సినిమాకు కూడా తన మద్దతు
ఉంటుందని ప్రకటించారు సురేష్ బాబు.
No comments:
Post a Comment