Monday, December 18, 2017

త్రివిక్రమ్ ఏం ప్లానే వేశాడులే!!

ఈ మధ్య సినిమాలకు... ముఖ్యంగా భారీ బడ్జెట్ మూవీస్ కు ఆడియో ఫంక్షన్స్ కు బదులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసికి ఆడియో రిలీజ్ ఫంక్షన్ నే నిర్వహిస్తున్నారు. రెండు పాటలు ఆన్ లైన్ లో రిలీజ్ చేసినా.. మిగిలిన పాటలను వేడుకలోనే వదలబోతున్నారు.

అయితే.. ఆడియో ఫంక్షన్ రోజున థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఈ ట్రెండ్ ను బ్రేక్ చేయబోతున్నాడట పవర్ స్టార్. ఆడియో రిలీజ్ నాడు ట్రైలర్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇంకా ఫైనల్ కట్ రెడీ కాలేదని.. అందుకే ట్రైలర్ ను వాయిదా వేసుకున్నారనే టాక్ వినిపిస్తున్నా.. అసలు వాస్తవం వేరే ఉందట. అజ్ఞాతవాసి చిత్రం కోసం ముందు నుంచి పక్కా ప్లానింగ్ తో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పటికే ట్రైలర్ ను కూడా ఫైనల్ చేసేసుకున్నాడట. కానీ ఉద్దేశ్యపూర్వకంగానే పవర్ స్టార్ మూవీ ట్రైలర్ ను వదలడం లేదని తెలుస్తోంది.

పవన్ కి సంబంధించిన ఏ అప్ డేట్ అయినా.. కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంటుంది. ఇఫ్పుడు ఆడియో ఫంక్షన్ లో కొత్త పాటలు వస్తాయి.. జనాల్లో ఓ వారం బజ్ కంటిన్యూ అవుతుంది. అదే సమయంలో ట్రైలర్ ఇచ్చే బదులు.. ఓ వారం గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట మాంత్రికుడు. క్రిస్మస్ నాడు అజ్ఞాతవాసి ట్రైలర్ ఇస్తే.. ఈ బజ్ కచ్చితంగా న్యూ ఇయర్ వరకూ ఉంటుంది. ఆ తర్వాత చిన్న పాటి అప్డేట్స్ తో పాటు.. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తారు. అలా అజ్ఞాతవాసిని ఆల్ టైం ట్రెండింగ్ లో ఉంచేందుకు త్రివిక్రమ్ వేసిన ఇంటెలిజెంట్ లో ప్లాన్ లో భాగంగా.. ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నారట.

No comments:

Post a Comment