Tuesday, December 19, 2017

ప్రభాస్ తో మందు పార్టీ: ఆ కిక్కే వేరు

స్వయంగా అఖిల్ చెబుతున్న మాటిది. పార్టీలో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరంటున్నాడు ఈ అక్కినేని హీరో. రానాతో కలిసి ఎక్స్ క్లూజివ్ గా పార్టీ చేసుకుంటే ఆ పార్టీకి ఎవర్ని పిలుస్తారనే ప్రశ్నకు అఖిల్ ఇలా స్పందించాడు. పార్టీలో తను, రానాతో పాటు ప్రభాస్ ఉంటే చాలా బాగుంటుందని అంటున్నాడు.
"నేను ఎప్పుడు పార్టీ చేసుకున్నా అక్కడ రానా ఉండాల్సిందే. నాకు అలా అలవాటైపోయింది. ఇక మేమిద్దరం కలిసి కూర్చున్నప్పుడు.. ఎక్కువగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. పార్టీలో ప్రభాస్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక నాకు, రానాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్. పార్టీ ఉంటే చరణ్ కు కచ్చితంగా కాల్ చేస్తా." అంటున్నాడు అఖిల్.
తామంతా పార్టీని చాలా కూల్ గా ఎంజాయ్ చేస్తామని... కానీ తమ బ్యాచ్ లోకి మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ చేరారంటే మాత్రం రచ్చ అయిపోతుందంటున్నాడు అఖిల్. వాళ్లిద్దరి అల్లరిని బ్యాలెన్స్ చేయడం తమ వల్ల కాదంటున్నాడు. 
ఇలా తన ప్రైవేట్ లైఫ్ విషయాల్ని ఫస్ట్ టైం మీడియాతో షేర్ చేసుకున్నాడు అఖిల్. ఇదే సందర్భంలో రానా-త్రిష ఎఫైర్ పై సరదా కామెంట్ చేశాడు. పక్కన రానా ఉంటుండగా త్రిషను పార్టీకి పిలవనంటున్నాడు. అలా చేస్తే రానా తనకు స్పాట్ పెట్టేస్తాడంటున్నాడు అఖిల్.

No comments:

Post a Comment