Wednesday, December 20, 2017

పవన్-శరత్-త్రివిక్రమ్

నిన్నటికి నిన్న అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్నవాళ్లంతా కాస్త షాక్ కు గురయ్యారు. పవన్ ఏమిటి? అలా అప్రస్తుత ప్రసంగం చేయడం ఏమిటి? అసలు పవన్ అవుటాఫ్ మూడ్ లో వున్నట్లు కనిపించారేమిటీ? అని అనుకున్నారు. అసలు పవన్ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది. త్రివిక్రమ్-పవన్ బంధం గురించి బయట ఎక్కడా ఏ వార్త రాలేదు. కానీ పవన్ ఎందుకు సంజాయషీ ఇస్తున్నట్లు మాట్లాడారు?
పైగా పవన్ మాట్లాడిన మాటల్లో విశ్వసనీయత కరువైంది. తక్కువకు తీసి, ఎక్కువ లాభం చేసుకోవాలనుకుంటారు నిర్మాతలు అన్నారు. నిజానికి ఆ పని చేసింది ఆయనే. సర్దార్ గబ్బర్ సింగ్ కాస్ట్ ఫెయిల్యూర్ అని ఆయనే ఒప్పుకున్నారు. అందుకే మరో సినిమాను తన మితృడు శరత్ మరార్ కోసం చేసారు. అది తక్కువకు చేసి, శరత్ బాకీలు చాలా వరకు తీర్చారు. అక్కడ కూడా పవన్ పట్టుపట్టి తనకు ఇంత ఇవ్వాల్సిందే అని తీసుకోవడం వల్లనే ఇద్దరి మధ్య స్నేహం చెడిందని గుసగుసలు వున్నాయి. మరి అలాంటిది పవన్ ఇలా మాట్లాడడం ఏమిటి? అసలు ఏం జరిగి వుంటుంది?
త్రివిక్రమ్ కారణంగానే
పవన్ చిరకాల మితృడు శరత్ మరార్ ఆయనను కాదని బయటకు వచ్చేసారు. ఇది పవన్ ను చాలా డిస్ట్రబ్ చేసిందన్నది సన్నిహిత వర్గాల బోగట్టా. 'నాతో వుండడం కష్టం. నాకు తెలుసు కూడా ఆ సంగతి. ఇన్నాళ్లు అలాగే వున్నాడుగా. ఇప్పుడేమయింది? ఎందుకు వెళ్లిపోవాలి' అని శరత్ వెళ్లిపోయిన కొత్తలో పవన్ కొంత మంది దగ్గర పదే పదే అన్నట్లు తెలుస్తోంది. 
పైకి చెప్పకున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే శరత్ మురార్ పట్ల పవన్ కళ్యాణ్ అపార్థం పెంచుకున్నారని శరత్ మురార్ సన్నిహిత వర్గాల్లో వినిపించిన గుసగుసలు వున్నాయి.
పవన్ దగ్గర త్రివిక్రమ్ వున్న టైమ్ లో, శరత్ మరార్ వస్తే, తివిక్రమ్ కావాలని..''..ఆ ఏం శరత్ కాటమరాయుడు ఎలా వస్తోంది. ఎంత ముఫైలో అయిపోతుంది కదా?' అని ప్రశ్నించేవారని కొందరు అంటున్నారు. అలా అంటే కాటమరాయుడు జస్ట్ ముఫై కోట్లలో అయిపోతుంది, బోలెడు మిగుల్తుంది అని అన్యాపదేశంగా చెప్పినట్లు అయ్యేదట. దాంటో పవన్ వన్ ఫైన్ మార్నింగ్, తన వాటా లేదా రెమ్యూనిరేషన్ గా ఫలానా అమౌంట్ ఇవ్వమని శరత్ ను అడిగినట్లు బోగట్టా.
దానికి శరత్, లెక్కలు చూసుకోండి. ఇంత ఖర్చయింది అని చెప్పినా పవన్ వినలేదని శరత్ సర్కిల్ లో గుసగుసలు వున్నాయి. ఆఖరికి శరత్ అడిగినంతా ఇచ్చేసారట. తరువాత, తాను ఉండలేనని, వేరే చేద్దాం అనుకుంటున్నానని, ఈ ప్రెజెర్ తట్టుకోలేనని శరత్ చెప్పేసారట పవన్ కు. దానికి బదులుగా పవన్, 'అలాగా.. అయితే ఓకె. నీ ఇష్టం' అనేసారట.
ఇదీ జరిగిందని పైకి రాకున్నా, ఇండస్ట్రీలోనూ, ఓవర్ సీస్ లోనూ శరత్ సర్కిల్ లో వినిపించింది. ఇదంతా జరిగి కొన్ని నెలలు గడచిపోయింది. అయితే అప్పట్లోనే శరత్ కోట్లకు లెక్కలు చెప్పలేదని, అందుకే పవన్ బయటకు పంపారని ఫీలర్లు వదిలే ప్రయత్నం కూడా జరిగిందని గుసగుసలు వున్నాయిు. ఈ ఫీలర్లు త్రివిక్రమ్ సర్కిల్ నుంచి వచ్చి వుంటాయన్న అనుమానాలు వున్నాయి. కానీ మొత్తం మీద కొన్ని నెలల క్రితమే అంతా సైలెంట్ అయింది.
కానీ ఇప్పుడు త్రివిక్రమ్ మాటలు తను వింటున్నా అని జనం అనుకుంటున్నారన్న విషయాన్ని పవన్ తానే చెప్పి, తానే వివరణ ఇచ్చి, కొత్తగా మళ్లీ అనుమానాలు రేకెత్తించారు. అంటే పైకి రాకున్నా, ఇంకా ఇన్ సైడ్ సర్కిళ్లలో పవన్-శరత్-త్రివిక్రమ్ ట్రయాంగిల్ నడుస్తోందని అనుకోవాలి. 
ఒక మాట మాత్రం వాస్తవం. శరత్ మరార్ లేని లోటు పవన్ కు పూడ్చలేనిది. ఎందుకంటే అన్నీ తానై చేసుకుని వచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వర్గాలతో కూడా పవన్ తరపున శరత్ నే మాట్లాడేవారట. బాబుగారికి ఏదైనా చెప్పాలన్నా శరత్ ద్వారానే ఫోన్ చేయించేవారట. అంతే కానీ పవన్ నేరుగా మాట్లాడేవారు కాదని తెలుస్తోంది. ఇక ఆర్థిక వ్యవహారాల సంగతి సరేసరి. 
మరి అలాంటి హ్యాండ్ ఒకటి దూరమైతే కాస్త ఫ్రస్టేషన్ రావడం సహజం. శరత్ మరార్ అంత ఇష్టుడు అయినపుడు, సహాయకుడు అయినపుడు, పవన్ కాస్త తన పంతం పక్కన పెడితే పని జరిగిపోతుందిగా? అంతే కానీ, 'నాతో వుండడం, నన్ను భరించడం కష్టం. నాకు తెలుసు. అయినా వెళ్లిపోతాడా' అని సన్నిహితుల దగ్గర అనే బదులు, శరత్ తోనే అంటే వెంటనే వెనక్కు వచ్చేస్తాడేమో?

No comments:

Post a Comment