ధనుష్ మంచి నటుడు మాత్రమే కాదు, అతడిలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడు. ఆ
విషయం "పా పాండీ" అనే సినిమాతో అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడీ టాలెంటెడ్
హీరో దర్శకుడిగా తన రెండో సినిమాను సిద్ధం చేస్తున్నాడు. అంతేకాదు.. ఆ
సినిమాలో హీరోగా కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
త్వరలోనే తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు ధనుష్.
స్వతంత్రానికి ముందున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది రానుంది. ఈ డిఫరెంట్
మూవీని డైరక్ట్ చేయడంతో పాటు అందులో హీరోగా కూడా నటిస్తాడు ధనుష్.
ప్రస్తుతం మామ రజనీకాంత్ హీరోగా కాలా అనే సినిమాను నిర్మిస్తున్నాడు
ధనుష్. మరోవైపు గౌతమ్ మీనన్, వెట్రిమారన్ దర్శకత్వంలో 2 సినిమాలు
చేస్తున్నాడు. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే స్వీయదర్శకత్వంలో సినిమా
మొదలుపెడతాడు.
అన్నట్టు కొత్త ఏడాదిలో హాలీవుడ్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు ఈ హీరో.
కెన్ స్కాట్ దర్శకత్వంలో "ది ఎక్సటార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్" అనే సినిమా
చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఈ మూవీ.
No comments:
Post a Comment