సైరా సినిమా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక
చిత్రం. ఈ సినిమా మేకింగ్ టైమ్ లోనే సంచలానాలు నమోదు చేస్తోంది. ఈ సినిమా
ఇంటర్ నెట్ కంటెంట్ హక్కులు అమెజాన్ 19.5 కోట్లకు తీసుకుందన్నది పాత
వార్తే. సినిమా మేకింగ్ విడియోల దగ్గర నుంచి అమెజాన్ ప్రయిమ్ లో
వుంచుతుందని తెలుస్తోంది. అయితే సినిమాను అన్ని కోట్లు పెట్టి కేవలం నెట్
హక్కులను మాత్రమే కొన్నందుకన అమెజాన్ కు లాభం ఏమిటి?
సినిమాను విడుదల అయిన అతి త్వరలోనే ప్రయిమ్ లో వుంచేలా అగ్రిమెంట్
జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గోప్యంగా వుంచారని
అంటున్నారు. పైకి తెలిస్తే బయ్యర్లు ఆలోచనలో పడతారు. ఈ మధ్య అమెజాన్ చాలా
దూకుడుగా సినిమాలు కొంటోంది. అంతర్జాతీయ సంస్థ అయిన అమెజాన్ కు నిధుల
సమస్యలేదు. అంతా లాంగ్ టెర్మ్ స్ట్రాటజీతో వెళ్తుంది.
చాలా వరకు సినిమాలను నెల పదిహేను రోజులకు అమెజాన్ లో వుంచుకునేలా
అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజా ది గ్రేట్ సినిమాను అలాగే
చేసారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాను కూడా అలాగే వుంచారు. ఇప్పుడు
ఇలాంటి షార్ట్ టైమ్ ఒప్పందమే సైరాతో కూడా చేసుకున్నారని తెలుస్తోంది. అంటే
విడుదలయిన ఆరువారాల్లో సినిమా అమెజాన్ లోకి వచ్చేస్తుందని అనుకోవాలి. పది,
ఇరవైకోట్ల బడ్జెట్ సినిమాలు అయితే ఓకె. మరీ వందకోట్ల బడ్జెట్ సినిమా అంటే
ఆలోచించాల్సిందే.
అంటే ఈ రోజుల్లో రెండు వారాల్లోనే మొత్తం లాగేస్తారు కాబట్టి, ఆరువారాలు
అంటే చాలా పెద్ద గ్యాప్ అని అనుకుంటున్నారేమో? కానీ ఆరువారాల్లో సినిమా
కచ్చితంగా నెట్ లోకి వస్తుంది అని తెలిస్తే, సినిమాకు దూరంగా వుండేవారు
కొందరయినా వుంటారు. సైరా లాంటి సినిమా తొలి రెండు వారాలు రష్ గా వుంటుంది.
అలాంటి టైమ్ లో థియేటర్ కు దూరంగా వుండేవారు, మరో రెండు వారాలు ఆగుదాంలే
అనుకుంటే, లెక్కలు తేడా వచ్చే ప్రమాదం వుంది.
ఏదయినా ఇకపై ఈ నెలా పదిహేను రోజుల అగ్రిమెంట్ అన్నది థియేటర్లకు మేలు చేస్తుందా? చేడు చేస్తుందా అన్నది చూడాలి.
No comments:
Post a Comment