Tuesday, May 28, 2019
బోయపాటిని నమ్మలేకపోతున్నారా?
వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్. దర్శకుడు బోయపాటికి అదే ఓ షాక్ అనుకుంటే, ఆయన అభిమాన, అనుబంధ, సంబంధ, బాంధవ్య పార్టీ తెలుగుదేశం అతి దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ కోసం విజయవాడలో నెలరోజుల పాటు కూర్చుని బోయపాటి చేసిన ప్రకటనలు హిట్. కానీ ఎన్నికల్లో పార్టీ మాత్రం ఫ్లాప్.
ఇదిలా వుంటే మళ్లీ సినిమా అన్నది బోయపాటికి పెద్ద సమస్యగా మారింది. టాప్ లైన్ హీరోలు ఎవ్వరూ రెడీగా లేకపోవడమే దీనికి కారణం. బాలయ్యతో సినిమా అంటే ఆయన కేఎస్ రవికుమార్ కు డేట్ లు ఇచ్చారు.
లేటెస్ట్ ఇన్ ఫో ఏమిటంటే, బోయపాటి తయారు చేసిన స్క్రిప్ట్ కు బాలయ్య ఓకె అన్నారు. కానీ నిర్మాత ఎవరు? ఎందుకంటే ఈ స్క్రిప్ట్ కు బోయపాటి 60 కోట్ల ప్యాకేజ్ చెబుతున్నారు. బాలయ్య మీద 60 అంటే రిస్క్ అని, పైగా అరవైతో ఆగదని, చివర్లో మరో కొంత పెరుగుతుందని భయపడుతున్నారు. 50 కోట్ల ఫ్యాకేజ్, అది కూడా దానికి పెరిగితే అది బోయపాటి పెట్టుకునేలా అయితే నిర్మాతలు కొందరు ముందుకు రావడానికి ఇంట్రస్ట్ గా వున్నారు.
బాలయ్య కానీ, బోయపాటి కానీ నిర్మాణం ఎవరు అన్నది ఫైనల్ చేసుకోగలిగితే సినిమా వుంటుంది. అది కూడా డిసెంబర్ తరువాత సంగతి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment