![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj1irwVuBJdaTtvD6IehQ6etIu2kH3Mzf00RCq0erBTGhATZamrzYihV25ZtfAQNQAgGcMWwM7NfuGibu_sd59Q_-Yq3st8rFAv_mRxDQEKubysQsEtINcw9Sppe17u1HyZox1Rq0ecOGW8/s1600/b1.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhGU2-VOPXbsfQh5EXpKxvTS2htEKT4J5bsXzFzuwnabdXsNeDZ3C_GiwcLxzEeHOdyX-ekqGKUBRfQ8wcsstqyYj3kq_3X1Nx7o9bXJ-uKDwdMDWlJDpVOgy9PgD4ZRmhHy90fN4yxxjsB/s1600/b2.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg6j9X797Jg23_yEkI_Pi12Wik-jkwXRMfoelGviq_B7pQcxPGIxAg4wqR11aFgEZGSzDpJejE-VQdajZ2y7ZCiAPAtRhIGUOKi4gU4q5ub-P-pvUU8d1DE0u85VlX7_AF1Ueml78vb0iPk/s1600/g.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjl8HqQvkGjOUpx4Y9ZulbA306EMLsc6XspVqbv7cLGYleDtYkMdj-9FQva5GF_Ls9RuLaY5U60l_64aj0Ojvc3kkOvyMrw6yJ5WvnD04hI94BkIt_q4FBSmxupmxI_8iXi98PEVBL2mrwn/s1600/Visha.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6lMJ_9Xd6DtuTrJ7xwED6QbaYLrlf4JncvlrOSOnXIhFnB_MvrfQM8aHGM8Dw1o25CSkm-CPF5lkC_rfsGQqln1iLfjDTuMPDuiPlgixzdJtXhOzAIkJ7QdMAnwT4PcYJnlzCOlc7M9XX/s1600/1500x500.jpg)
Monday, June 17, 2019
పాపం తమన్నా.. మళ్లీ బుక్కయిపోయింది
సౌత్ లో ఎన్ని సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ బాలీవుడ్ లో మెరవాలనేది తమన్నా డ్రీమ్. అందుకే హిందీ నుంచి ఏ చిన్న అవకాశం వచ్చినా మిస్ అవ్వదు. అవసరమైతే ఓ సౌత్ సినిమా పక్కనపెట్టి మరీ బాలీవుడ్ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తుంది. కానీ మిల్కీ బ్యూటీ ఎంత ప్రయత్నించినా హిందీలో మాత్రం క్లిక్ అవ్వలేకపోతోంది. తాజాగా అమె మరోసారి బుక్ అయిపోయింది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత హిందీలో ఓ సినిమా చేసింది తమన్న. ప్రభుదేవాతో కలిసి ఆమె నటించిన ఖామోషీ సినిమా గతవారం విడుదలైంది. హిందీ జనాలకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేకపోయినా, తమన్న మాత్రం భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ విడుదలైన 3 రోజులుకే ఈ సినిమా దుకాణం సర్దేసింది.
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. కానీ వీకెండ్ లో పుంజుకుంటుందేమో అని వెయిట్ చేశారు. అయితే శని, ఆదివారాలు కూడా ఖామోషీ సినిమా గట్టెక్కలేకపోయింది. దీనికితోడు ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ప్రభావం గట్టిగా పడింది. అలా విడుదలైన 3 రోజులకే తమన్న సినిమా డిజాస్టర్ అనిపించుకుంది.
బాలీవుడ్ లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తమన్నాకు కలిసిరావడం లేదు. 2013లో అజయ్ దేవగన్ తో చేసిన హిమ్మత్ వాలా సినిమా నుంచి ఆమెను బాలీవుడ్ లో ఫ్లాపులు వెక్కిరిస్తూనే ఉన్నాయి. మధ్యలో వచ్చిన "ఎంటర్ టైన్ మెంట్" అనే సినిమా ఓ మోస్తరుగా ఆడినప్పటికీ తమన్న బాలీవుడ్ కెరీర్ కు అది ఏమాత్రం కలిసిరాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiVR8RCjUs9JQ59FC5qvgWlwVP74tYIDng0PQLVbf7NnWrK3FHVALkDzsRhdKOaKQpsmjXXL25bpRYUNoY739ZJ7NWMkjbB9hsVfsIBvLNjJkPTgErvY9QWjoGmar59bz_cFqb_jDsjZq8D/s1600/RA.jpg)
No comments:
Post a Comment