Monday, July 15, 2019

అఖిల్ సినిమా షురూ

మొత్తానికి స్టార్ట్ అయింది. మిస్టర్ మజ్ఞు తరువాత అఖిల్ అక్కినేని చేస్తున్న సినిమా షూట్ స్టార్ట్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో గీతాసంస్థ నిర్మించే సినిమా ఇన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే వుండిపోయింది. ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది.
కానీ ఇంకా అసలు విషయం ఏమిటంటే, హీరోయిన్ ఫైనల్ కాలేదు. అయితే సిన్మా స్క్రిప్ట్ ప్రకారం హీరోయిన్ లేకుండా తీసే సీన్లు కాస్త ఎక్కువే వున్నాయని తెలుస్తోంది. అందుకే ముందు ఆ సీన్లు అన్నీ ఫినిష్ చేసే ఉద్దేశంతో షూటింగ్ మొదలు పెట్టేసారు.
సినిమాకు సరైన హీరోయిన్ కోసం నిర్మాత బన్నీ వాస్ అన్వేషిస్తున్నారు. వీలయినంత వరకు కొత్త అమ్మాయినే హీరోయిన్ గా తీసుకునే అవకాశం వుంది. ఇప్పటికే కొన్ని ఆల్బమ్ లు, కొన్ని ప్రొఫైల్ లు చూసారు కానీ ఏవీ ఫైనల్ కాలేదు. ఇటు దర్శకుడి స్క్రిప్ట్ కు, అటు హీరోకి పెయిర్ గా అన్నివిధాలా మ్యాచ్ అయ్యే అమ్మాయి కోసం వేట సాగుతోంది.

No comments:

Post a Comment