Wednesday, July 24, 2019

అల్లు దగ్గరా అతనికి అదే ట్రీట్‌మెంట్‌

కథ రెడీ అవడానికి టైమ్‌ పడుతోంది కదా అని ముందు అనుకున్న దానికంటే మరో రెండు నెలలు అదనంగా వెయిట్‌ చేయమని మహేష్‌ అడిగితే ససేమీరా కుదరదని అల్లు అర్జున్‌ దగ్గరకి వెళ్లిపోయాడు సుకుమార్‌. తీరా అల్లు అర్జున్‌ దగ్గర మరో ఏడాది అయినా వేచి చూడక తప్పేలా లేదట. సుకుమార్‌ కథ విషయంలో అల్లు అర్జున్‌కి ఇంకా అనుమానాలు వున్నాయట. ఇంకా కథ పక్కాగా సిద్ధం కాలేదని ఐకాన్‌తో పాటు బోయపాటి సినిమా కూడా కన్సిడర్‌ చేస్తున్నాడట.

తన చిత్రానికి ఇంతవరకు పక్కాగా లాంఛింగ్‌ డేట్‌ చెప్పలేదని సుకుమార్‌ ఫైర్‌ అవుతున్నా కానీ అల్లు అర్జున్‌ మాత్రం తన ధోరణిలో వేరే ప్రాజెక్టులు కన్సిడర్‌ చేస్తున్నాడట. మహేష్‌బాబు దగ్గరయితే అనిల్‌ రావిపూడి సినిమా అయిపోయే వరకు ఆగమని మాత్రమే అడిగారు. అందుకే ఒప్పుకోకుండా అల్లు అర్జున్‌ దగ్గరకు వచ్చిన సుకుమార్‌ అతను కనీసం రెండు సినిమాలయినా పూర్తి చేసే వరకు ఆగాల్సి వచ్చేట్టుంది.

ఇది సుకుమార్‌ని బాగా అప్‌సెట్‌ చేసిందని, ఆర్యతో అల్లు అర్జున్‌కి బ్రేక్‌ ఇచ్చిన తనకి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదని సన్నిహితుల వద్ద బాధ పడుతున్నాడట. రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత తన సినిమా కోసం ఒక రెండు నెలలు ఆగలేని పరిస్థితిలో హీరోలు వుండడమేంటని వాపోతున్నాడట. తెలుగు సినిమా పరిశ్రమ హీరో డామినేటెడ్‌ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి?

No comments:

Post a Comment