దక్షిణాదిన వివిధ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. కాకపోతే గత
కొన్నేళ్లలో సూర్యకు సరైన విజయాల్లేకపోవడంతో అతడి మార్కెట్ దెబ్బ తింది.
సూర్య సినిమాల్ని చూసి వేరే వాళ్లు భయపడటం మాని.. ఇప్పుడు సూర్యనే వేరే
వాళ్ల సినిమాల్ని చూసి కంగారు పడే పరిస్థితి వచ్చింది.
తన కొత్త సినిమా ‘కాప్పన్/బందోబస్త్’ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని సూర్య అనుకున్నాడు. కానీ అదే రోజు ‘సాహో’ వస్తుందని.. దాంతో పోటీ పడటం ఎందుకని ఆగస్టు 30కి డేట్ మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు ‘సాహో’ ఆగస్టు 15 నుంచి వాయిదా పడి 30కి ఫిక్స్ అయింది. ‘కాప్పన్’ను 30కి అనుకున్నాక అందుకు తగ్గట్లే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రమోషన్లు చేస్తున్నారు. మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని వెనక్కి కూడా వెళ్లాలనుకోవట్లేదు.
ఆగస్టు 30నే ‘కాప్పన్’ను రిలీజ్ చేసేయాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయిపోయింది. ‘సాహో’ వస్తే రానీ అనే తెగింపుకు చిత్ర బృందం వెళ్లిపోయింది. ‘సాహో’ వల్ల తమకెంత నష్టమో.. తమ సినిమా వల్ల ‘సాహో’కు కూడా అంతే నష్టం ఉంటుందని.. కంటెంట్‌ను నమ్ముకుని ముందుకు వెళ్లిపోదామని ‘కాప్పన్’ టీం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో మోహన్ లాల్ కూడా నటిస్తుండటం, సూర్యకు కేరళలో మాంచి ఫాలోయింగ్ ఉండటంతో మలయాళంలో కూడా ‘కాప్పన్’ పెద్ద స్థాయిలో విడుదల కానుంది. తమిళనాట ఎలాగూ సినిమా పెద్ద ఎత్తునే రిలీజవుతుంది. ఒక్క తెలుగులో మాత్రం ఇబ్బంది తప్పకపోవచ్చు. అయినా ఇక్కడ ఆల్రెడీ సూర్య మార్కెట్ బాగా దెబ్బ తినేసింది కాబట్టి దీనిపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నట్లు లేరు.
ఇంతకుముందు సూర్యకు ‘వీడొక్కడే’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ తెరకెక్కింది. వీరి కలయికలో చివరగా వచ్చిన ‘బ్రదర్స్’ నిరాశపరిచింది.

No comments:
Post a Comment