Monday, July 8, 2019

పార్టీకి పిలవలేదని అల్లు అర్జున్ హర్టు

అల్లు అర్జున్ తన సినిమాలకు సంంబంధించి విశేషాలతో కంటే వేరే విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడీ మధ్య. తన లగ్జీరియస్ కారవాన్ ‘ఫాల్కన్’ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బన్నీ. దాని లోపల వైభవం చూసి జనాలకు దిమ్మదిరిగింది. ఆ తర్వాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి చిన్న సినిమాలు చూసి ఆ చిత్ర బృందాల్ని అభినందిస్తూ ఫొటోలు దిగడం.. ఆ సినిమాల గురించి తన అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా బన్నీ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికర పోస్టుతో బన్నీ అందరి దృష్టినీ ఆకర్షించాడు.

బన్నీ పర్సనల్ స్టాఫ్‌కు చెందిన శరత్ చంద్ర అనే ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పార్టీ ఫొటో ఒకటి షేర్ చేశాడు. దీనిపై బన్నీ ఆసక్తికర రీతిలో స్పందించాడు. ప్రతి ఆదివారం ఉదయం లేచి చూస్తే.. శనివారం రాత్రి తన స్టాఫ్ మెంబర్స్ అందరూ పార్టీ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయని.. వాళ్ల జీవితం తన జీవితం కంటే చాలా సంతోషంగా సాగిపోతోందని అన్నాడు బన్నీ.

చివరగా ‘‘నన్ను కూడా పార్టీకి పిలవొచ్చు కదా’’ అనే కామెంట్‌ కూడా జోడించాడు స్టైలిష్ స్టార్. టాలీవుడ్లో తన స్టాఫ్ మెంబర్స్‌ను చాలా బాగా చూసుకునే హీరోల్లో ఒకడిగా బన్నీకి పేరుంది. తన ఎదుగుదలలో సహకరించిన బన్నీ వాసు, మారుతి, ఎస్కేఎన్ లాంటి వాళ్లకు బన్నీ ఎలా తోడ్పాటు అందించి పైకి తీసుకొచ్చాడో తెలిసిందే. ఇంకా తన టీంలోని మిగతా వాళ్లను కూడా మంచి స్థాయికి తీసుకురావాలన్నది తన కోరిక అని గతంలోనే బన్నీ ఒకసారి చెప్పిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment