Tuesday, July 9, 2019

రేపు విజయవాడలో ‘ఓ బేబీ’ సమంత సందడి

సమంత ప్రస్తుతం “ఓ బేబీ” మూవీ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు, సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. వసూళ్ల పరంగా కూడా “ఓ బేబీ” మూవీ భేష్ అనిపిస్తూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈ విజయాన్ని తన అభిమానులతో కలిసి జరుపుకోవాలని సమంత భావిస్తోంది. ఇందుకోసం రేపు సమంత విజయవాడలో సందడి చేయనుంది.
విజయవాడ లబ్బీపేట్ లోగల ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 4:30 నిమిషాలకు మొదలుకానున్న విజయోత్సవ కారక్రమానికి హాజరై వేదికపై సందడి చేయనుంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ నందిని రెడ్డి తో పాటు చిత్రంలోని ముఖ్య నటులు,నిర్మాతలు పాల్గొననున్నారని సమాచారం.

No comments:

Post a Comment