ఈ మధ్య కాలంలో ‘డియర్ కామ్రేడ్’కు వచ్చినంత పాజిటివ్ బజ్ మరే తెలుగు
సినిమాకూ రాలేదు. ఫుల్ పాజిటివిటీ మధ్య ఈ సినిమా విడుదలవుతోంది. చక్కటి
టీజర్, ట్రైలర్.. అదిరిపోయే పాటలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. దీనికి తోడు
మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఓ రేంజిలో చెప్పేసింది చిత్ర
బృందం.
వాళ్ల మాటల్ని బట్టి చూస్తే ఇదో క్లాసిక్ అన్న ఫీలింగ్ జనాలకు వచ్చేసింది. బయ్యర్లు కూడా సినిమాను చాలా నమ్మేసి భారీగా పెట్టుబడులు పెట్టేశారు. విజయ్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రమిది. మరి నిజంగా ఇంతమంది భారీ అంచనాల్ని నిలబెట్టే సినిమా ‘డియర్ కామ్రేడ్’ అవుతుందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కొత్త దర్శకుడు భరత్ కమ్మ తొలి ప్రయత్నంలోనే ప్రామిసింగ్ సినిమా తీశాడనే ఫీలింగ్ మొదట్నుంచి కలిగిస్తున్నాడు. ప్రోమోలు చూస్తే ఇది సీరియస్ కథలాగే అనిపిస్తోంది. ‘గీత గోవిందం’లో మాదిరి కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ ఉంటే ఉండొచ్చు కానీ.. మొత్తానికిది సీరియస్ సినిమాలాగే కనిపిస్తోంది. గాఢత ఎక్కువున్నట్లుంది. మరి ఎక్కువగా విజయ్ నుంచి ఎంటర్టైనర్లు ఆశించే అతడి అభిమానులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం.

No comments:
Post a Comment