‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోకు చిప్ రూపంలో వేరే వ్యక్తి బుర్ర
పెట్టేస్తారు. ఊర మాస్‌గా, రొటీన్‌గా అనిపించే ఈ చిత్రంలో కొత్తగా అనిపించే
పాయింట్ ఇదొక్కటే. చాలా ఏళ్లుగా రొటీన్ సినిమాలతో లాగించేస్తున్న పూరి..
ఇంత కొత్తగా ఎలా ఆలోచించాడని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇక్కడ పూరి
క్రియేటివిటీ ఏమీ లేదు.
‘క్రిమినల్’ అనే హాలీవుడ్ నుంచి ఎత్తుకొచ్చేసిన కాన్సెప్ట్ ఇది. ‘క్రిమినల్’ సినిమా ట్రైలర్ చూస్తే.. యాజిటీజ్ ‘ఇస్మార్ట్ శంకర్’లోని కొన్ని సీన్లు కనిపిస్తాయి. కాకపోతే ఈ ఐడియా మాత్రం తీసుకుని మిగతాదంతా తనకు అలవాటైన రీతిలో లాగించేశాడు. ఐతే పూరీ ఇలా హాలీవుడ్ నుంచి ఐడియా తీసుకుని సినిమా తీస్తే.. ఆయన తన నుంచి ఐడియా కాపీ కొట్టేశాడంటూ నటుడు ఆకాశ్ ఆరోపిస్తుండటం విడ్డూరంగా ఉంది.
‘ఆనందం’ లాంటి రెండు మూడు సినిమాలతో అప్పట్లో కొంచెం పాపులారిటీ సంపాదించిన ఆకాశ్.. ఆ తర్వాత చెత్త చెత్త సినిమాలు చేశాడు. మధ్యలో డైరెక్షన్ కూడా వెలగబెట్టాడు. మరీ నాసిరకం సినిమాలు తీసి, చేసిన అతడిని అందరూ మరిచిపోయారు. ఇప్పుడతను ‘నాన్ యార్’ అనే తమిళ సినిమా చేశాడట. దాన్ని తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో తీశారట. ఈ చిత్రం తమిళంలో ఆల్రెడీ రిలీజైందట. త్వరలోనే తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకుంటుంటే పూరి అదే ఐడియాతో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి తనకు షాకిచ్చారట.
ఈ విషయమై సంప్రదిద్దామని చూస్తుంటే ఎవ్వరూ స్పందించట్లేదని.. తాను న్యాయ పోరాటం చేయబోతున్నానని అంటున్నాడు ఆకాశ్. ఐతే ఆకాశ్ అనేవాడు ఈ ఆరోపణలు చేస్తే జనాలు పట్టించుకునే పరిస్థితి ఉందా? ఒకవేళ ఆకాశ్ కూడా ఇదే కాన్సెప్టుతో సినిమా తీసి ఉన్నా.. అతను కూడా ‘క్రిమినల్’ నుంచి ఐడియా కాపీ కొట్టినట్లే భావించాలి. అలాంటపుడు మళ్లీ తన ఐడియాను కపూరి కాపీ కొట్టాడనడం కామెడీగా లేదూ?

No comments:
Post a Comment