Monday, July 1, 2019

సింగిల్ టేక్ షాట్ అదిరిందిగా కామ్రేడ్

డియర్ కామ్రేడ్ సినిమా నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. అదే విధంగా ఈరోజు కూడా ఓ సాంగ్ రిలీజైంది. కానీ ఇది కేవలం సంగీతంతోనే కాదు, టేకింగ్ తో కూడా ఆకట్టుకుంది. అవును.. డియర్ కామ్రేడ్ సినిమా నుంచి ఈరోజు రిలీజైన కాలేజ్ క్యాంటీన్ సాంగ్ ను సింగిల్ టేక్ లో పిక్చరైజ్ చేశారు. సాంగ్ తో పాటు టేకింగ్, కొరియోగ్రఫీ అదిరింది.
సినిమాకు సంబంధించి ఇప్పటివరకు లిరికల్ వీడియోలు మాత్రమే విడుదల చేస్తూ వచ్చారు. మధ్యమధ్యలో సినిమా క్లిప్స్ చూపించారు. కానీ కాలేజ్ క్యాంటీన్ సాంగ్  ను మాత్రం టోటల్ వీడియో రూపంలో రిలీజ్ చేశారు. దీనికి కారణం ఇది సింగిల్ టేక్ షాట్ కావడమే. వీడియోలో తన కాలేజ్ గ్యాంగ్ తో కలిసి ఫుల్ గా హంగామా చేశాడు హీరో విజయ్ దేవరకొండ. ఉన్నంతలో చిన్న డిసప్పాయింట్ మెంట్ ఏంటంటే, వీడియోలో హీరోయిన్ రష్మిక కనిపించలేదు.


ఈ సాంగ్ చూస్తే, శివ సినిమాలో క్యాంటీన్ సాంగ్ గుర్తుకురావడం సహజం. కార్తీక్ పాడిన ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జులై 26న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

No comments:

Post a Comment