Wednesday, July 3, 2019

‘కల్కి’ రాజశేఖర్‌ డ్యాన్స్‌ చేయడం చూశారా?

 రాజశేఖర్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. దీంతో చిత్ర బృందం ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి హీరో రాజశేఖర్‌ తనదైన శైలిలో స్టెప్‌లు వేస్తూ సందడి చేశారు. ఆయన కుమార్తెలు కూడా చిత్ర బృందంతో కలిసి చిందులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. అంతేకాదండోయ్‌ హీరోయిన్‌ అదా శర్మ, ప్రశాంత్‌ వర్మ డోలు వాయిస్తూ సంతోషంలో తేలిపోయారు.

No comments:

Post a Comment