Tuesday, February 4, 2020

అరవై కోట్ల నష్టం తెచ్చిన సూపర్‌స్టార్‌

రజనీకాంత్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌ అనేసరికి 'దర్బార్‌' కూడా శంకర్‌ సినిమాల్లా వుంటుందని తమిళనాట బయ్యర్లు భారీ రేట్లు పెట్టి కొన్నారు. అయితే దర్బార్‌ ఫ్లాప్‌ అవడంతో బయ్యర్లకి పాతిక కోట్లకి పైగా నష్టం వచ్చింది. దాంతో తమ నష్టాన్ని భర్తీ చేయమంటూ రజనీకాంత్‌ని కలుసుకునేందుకు బయ్యర్లు పెద్ద సంఖ్యలో వెళ్లారు. వారిని కలిసేందుకు రజనీకాంత్‌ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మధ్యవర్తుల సాయం తీసుకుంటున్నారు.

నష్టాలు వస్తే భర్తీ చేస్తామనే భరోసాని రజనీకాంత్‌, మురుగదాస్‌ ఇవ్వడం వల్లనే తాము దర్బార్‌ని భారీ రేట్లకి కొన్నామని, తమకి న్యాయం చేయాలని బయ్యర్లు డిమాండ్‌ చేస్తున్నారు. నిర్మాతని కాకుండా హీరోని నష్ట పరిహారం అడగడం ఏమిటని బయ్యర్లని అడగగా, ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ని సంప్రదించామని, వారికే అరవై కోట్ల నష్టం వచ్చిన సినిమాకి ఇక నష్ట పరిహారం ఎలా ఇస్తామని అడిగారని బయ్యర్లు తెలిపారు.

బాబా టైమ్‌లో నష్టాలు భర్తీ చేసిన రజనీకాంత్‌ ఆ తర్వాత తన చిత్రాలకి లాస్‌లు వస్తే తిరిగి ఇవ్వడం మానేసారు. తన కూతురి సంస్థ నుంచి వచ్చిన చిత్రాలకి కూడా ఆయన పట్టించుకోలేదు. లైకా నుంచి వచ్చిన దర్బార్‌కి నష్ట పరిహారం చెల్లిస్తారనేది ఉత్తి మాటే అనుకోక తప్పదు.
Source : gulte.com

No comments:

Post a Comment