Tuesday, February 4, 2020

చరణ్‌ ఆ జాక్‌పాట్‌ అతనికిచ్చేస్తాడా?

రామ్‌ చరణ్‌ నటించే మలి చిత్రాన్ని ఎవరు చేస్తారో ఆ దర్శకుడు నక్క తోకని తొక్కినట్టే. రాజమౌళి 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' తదుపరి చిత్రం కనుక ఆ చిత్రంపై క్రేజ్‌ పీక్స్‌లో వుంటుంది. చాలా మంది దర్శకులు చరణ్‌ కోసం రెడీగా వున్నా కానీ అతను మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు కాకుండా ఏదైనా ఎమోషనల్‌ సబ్జెక్ట్‌ చేయాలనుకుంటున్నాడు.

జెర్సీతో అందరి మన్ననలు అందుకున్న గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేయాలని చరణ్‌ ఆలోచిస్తున్నాడు. ఇటీవలే గౌతమ్‌ తనని కలిసి ఒక లైన్‌ కూడా చెప్పాడంటున్నారు. జెర్సీని హిందీలో రీమేక్‌ చేస్తోన్న గౌతమ్‌ జూన్‌లోగా ఫ్రీ అయిపోతాడు. అప్పటికి చరణ్‌కి 'ఆర్‌ఆర్‌ఆర్‌' పనులు కూడా పూర్తవుతాయి కనుక గౌతమ్‌ చిత్రం చేయడానికే మొగ్గు చూపుతున్నాడు.

జెర్సీ హిందీలో క్లిక్‌ అయితే అతనికి అక్కడ గుర్తింపు వస్తుంది కనుక పాన్‌ ఇండియా సినిమాగా అది చేయవచ్చునని చరణ్‌ భావిస్తున్నాడు. అయితే దీనిపై చరణ్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఎవరైనా స్టార్‌ డైరెక్టర్‌ తాను కోరుకునే లక్షణాలున్న కథతో వస్తే అదే చేయవచ్చు. లేదా గౌతమ్‌ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లవచ్చు. విశేషం ఏమిటంటే పవన్‌తో గౌతమ్‌ ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జోరుగా జరిగిన తర్వాత చరణ్‌ చిత్రం న్యూస్‌లోకి వచ్చింది.

No comments:

Post a Comment