Tuesday, February 4, 2020

బాహుబలి స్ఫూర్తితో భలే కొట్టాడు

'బాహుబలి' చిత్రానికి వచ్చిన ఆదరణతో బాలీవుడ్‌లో తర్వాత పలువురు అలాంటి భారీ కాస్టూమ్‌ డ్రామాలని తలపెట్టారు. అయితే బాహుబలికి వచ్చిన క్రేజ్‌ చూసి హడావుడిగా క్యాష్‌ చేసుకుందామనే తప్ప పకడ్బందీగా ఎవరూ ప్రయత్నించలేదు. అందుకే పీరియడ్‌ డ్రామాలు, కాస్టూమ్‌ డ్రామాలు చాలానే వచ్చినా కానీ ఏవీ సంచలనం కాలేదు.

అజయ్‌ దేవ్‌గణ్‌ మాత్రమే తన 'తన్హాజీ' విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అతను పడ్డ కష్టానికి తగ్గ ఫలితం బాక్సాఫీస్‌ వద్ద పొందుతున్నాడు. అజయ్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇంకా స్టడీగా రన్‌ అవుతోంది. రెండు వందల యాభై కోట్ల నెట్‌ వసూళ్లని ఇండియాలో దాటిన ఈ చిత్రం ఓవరాల్‌గా రెండు వందల డెబ్బయ్‌ అయిదు కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చాలా చిత్రాలు పోటీగా వచ్చినా కానీ సూపర్‌ రన్‌ కంటిన్యూ చేస్తోన్న తన్హాజీ గత ఏడాది కబీర్‌సింగ్‌ మాదిరిగా సర్‌ప్రైజ్‌ బ్లాక్‌బస్టర్‌ అయింది.

గోల్‌మాల్‌, సింగం సిరీస్‌ తప్ప అజయ్‌ సినిమాలు సరిగా ఆడవనే అపవాదుని కూడా ఈ చిత్రం తొలగించింది. దీంతో అతని తదుపరి చిత్రం 'మైదాన్‌'పై అంచనాలు తారాస్థాయిలోకి వెళ్లాయి. తన్హాజీ తర్వాత అజయ్‌ కీలక పాత్ర చేయడం రాజమౌళి మల్టీస్టారర్‌ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'కి కూడా పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది.

No comments:

Post a Comment