Tuesday, July 2, 2019

అక్కినేని ఫాన్స్‌కి ఎన్టీఆర్‌ హెడ్డేక్‌

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నాగార్జున హోస్ట్‌ చేస్తున్నాడనేది అఫీషియల్‌ అవగానే అంతకుముందు బిగ్‌బాస్‌ షో గురించి నాగార్జున చేసిన వ్యాఖ్యలని తీసుకొచ్చి ఆయనని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ షో కాన్సెప్టే తనకి ఇష్టముండదని, అది వాయొరిస్టిక్‌ అని, పక్కింటి వాడి జీవితంలోకి తొంగి చూడడం ఏమి గేమ్‌ అని నాగార్జున వ్యాఖ్యానించాడు. ఇప్పుడదే షోకి హోస్ట్‌ చేయడంతో నాగార్జునకి డబ్బు తప్ప విలువలు లేవని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌ సంగతి అలా వుంచితే ఎన్టీఆర్‌తో కంపారిజన్స్‌ గురించి అక్కినేని ఫాన్స్‌ వర్రీ అవుతున్నారు.

తొలి సీజన్‌ హోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌ తన వ్యాఖ్యానంతో దీనికో బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసాడు. సెకండ్‌ సీజన్‌లో నానిని అది ఘోస్ట్‌లా వెంటాడడంతో మధ్యలోనే తల పట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు ముగించేసి తప్పుకుందామా అన్నట్టు అన్యమనస్కంగానే ఆ షోలో పాల్గొన్నాడు. నాని తలపోటుని నాగార్జున దగ్గర్నుంచి చూసాడు. అప్పుడు నాని 'దేవదాస్‌' చిత్రం చేస్తుండడంతో ఆ తలనొప్పులేంటో నాగార్జునకి స్వయంగా తెలుసు. అయినా కానీ ఈసారి హోస్ట్‌ చేయడానికి నాగార్జున అంగీకరించాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోని హిట్‌ చేసిన నాగార్జున తనదైన శైలిలో 'బిగ్‌బాస్‌' షోకి కొత్త నిర్వచనం ఇస్తాడో లేక ఎన్టీఆర్‌ కంపారిజన్స్‌తో ఈ సీజన్‌ అంతా ఇబ్బందులు పడుతుంటాడో చూడాలి.

No comments:

Post a Comment