Tuesday, March 10, 2015

మహేష్‌బాబుతో త్రిశూలం దింపేస్తాడంట

మహేష్‌బాబుతో వర్క్‌ చేయాలని తెలుగు దర్శకులే చాలా మంది వెయిటింగ్‌లో ఉన్నారు. మహేష్‌కి అత్యంత సన్నిహితులు కూడా తమ టర్న్‌ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. తన ఫ్రెండ్స్‌కే కమిట్‌మెంట్‌ ఇవ్వలేకపోతున్న మహేష్‌బాబు ఇక తమిళ దర్శకులతో ఎలా పని చేస్తాడు. మణిరత్నం, శంకర్‌ అంతటోళ్లకే నో చెప్పేసిన మహేష్‌ ఇక కొత్తగా పుట్టుకొచ్చిన తమిళ దర్శకులని చూస్తాడంటారా? కానీ నీసన్‌ అనే తమిళ దర్శకుడు మాత్రం మహేష్‌తోనే తన తదుపరి చిత్రం చేస్తానంటూ భీష్మించుకు కూర్చున్నాడు. ఇతను తీసిన జిల్లా రీమేక్‌నే మేము చేస్తామంటే మేము చేస్తామంటూ ఇక్కడి వాళ్లు పోటీ పడిపోతున్నారు. తన రెండో సినిమాని మహేష్‌తోనే చేయాలని, అది కూడా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి చేయాలని నీసన్‌ అనుకుంటున్నాడు. మహేష్‌ ఒప్పుకుంటే ఈ త్రిభాషా చిత్రంతో త్రిశూలం దించేస్తాడంట. అన్ని భాషల్లోను పాపులర్‌ అయిన తమిళ హీరోలు తనకి అందుబాటులో ఉండగా మహేష్‌ కోసమే ఈ ఆరాటం దేనికో మరి. -

No comments:

Post a Comment