Tuesday, March 10, 2015

కుర్రోడి టైమ్‌ బాగుంది

నిఖిల్‌ టైమ్‌ సూపర్‌గా రన్‌ అవుతోంది. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఏళ్లు కష్టపడ్డ నిఖిల్‌కి ఫైనల్‌గా 'స్వామిరారా'తో సుడి తిరిగింది. తనకి ఎలాంటి సినిమాలు కరెక్ట్‌ అనేది నిఖిల్‌కి ఆ సినిమాతోనే తెలిసొచ్చింది. ఆ సక్సెస్‌ని క్యాష్‌ చేసుకోవాలని తొందర పడకుండా వెయిట్‌ చేసి 'కార్తికేయ'తో హిట్‌ కొట్టడమే కాకుండా హీరోగా తనపై నమ్మకాన్ని పెంచుకున్నాడు. సూర్య వర్సెస్‌ సూర్య సినిమాలో కూడా వైవిధ్యానికే ప్రయత్నించి మెప్పించాడు. ఈ చిత్రానికి యావరేజ్‌ టాక్‌ వచ్చినా కానీ నిఖిల్‌ గత చిత్రాల విజయాల ప్రభావం, అతనిపై ప్రేక్షకులకి పెరిగిన నమ్మకం దీనికి కలిసొస్తున్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ఈ చిత్రానికి ఎంత బూస్ట్‌ ఇవ్వగలిగితే అంత మంచిదని నిఖిల్‌ సెల్ఫీ టూర్‌ కూడా ప్లాన్‌ చేసాడు. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎంకరేజ్‌ చేయరని, బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారికి ఇక్కడ మనుగడ ఉండదని గగ్గోలు పెట్టే వారికి నిఖిల్‌ మబ్బులు చెదరగొట్టి, అదంతా ఒట్టి భ్రమ అని తెలియజెప్తున్నాడు. -

No comments:

Post a Comment