Wednesday, September 16, 2015
అలాంటి సీన్లలో నటించడానికి సిగ్గంటున్న తెలుగు హీరో..
సినిమాల్లోకి వచ్చే నటీనటులు, ముఖ్యంగా హీరో హీరోయిన్లకు ఫైట్లు, డ్యాన్సు వగైరాలు వచ్చి ఉండడం ఎంత ముఖ్యమో...తెరపై రొమాంటిక్ సీన్లను పండించడం వచ్చి ఉండడం కూడా అంతే ముఖ్యమైన విషయంగా మారిపోయింది. హీరో హీరోయిన్లు ముఖాలు ఎదురెదురుగా ఉంచి, అక్కడ కట్ చేసి తర్వాత రెండు చిలకలు ముద్దాడుకుంటున్నట్టో, ష్ ష్ అంటూ మూతి మీద వేలేసుకున్న బొమ్మనో చూపిస్తే ప్రేక్షకుడు సరిపెట్టుకునే రోజులు పోయి, ముద్దులూ, ముచ్చట్లూ కూడా కానిస్తేనే ఒప్పుకుంటున్న రోజులివి. అందుకే సినిమాల్లోకి వచ్చే ముందే అన్నిటికీ సిద్ధమై వచ్చేస్తున్నారు యువ నటీనటులు.
ఈ పరిస్థితుల్లోనూ శృంగార సన్నివేశాలలో అభినయించడానికి ముందూ వెనకా అయ్యే హీరోయిన్లు ఉన్నారంటేనే నమ్మడం విచిత్రం. అలాంటిది ఏకంగా ఒక హీరోగారే రొమాంటిక్ సీన్లు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడంటే మరింత ఆశ్చర్యం అనిపించకమానదు.
అలా సిగ్గు పడుతున్న హీరో సాయి ధరమ్ తేజ్. తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్‌తో మితిమీరి సన్నిహితంగా మెలిగే సీన్లలో నటించడం ఇబ్బందికరమైన విషయం అని చెబుతున్నాడీ యంగ్ స్టార్. రేయ్ తర్వాత వచ్చిన పిల్లా నీవు లేని జీవితంతో హీరోగా ఓకే అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్... ప్రస్తుతం మంచి అవకాశాలతోనే స్టడీగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
తాజాగా హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్న ఈ మెగా ఫ్యామిలీ వారసుడు... ఆ సినిమాలో హీరోయిన్‌తో ఉన్న కొన్ని సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డానన్నాడు. అయితే తనకు ఇలా ఇబ్బంది పడడం తొలిసారి కాదని కూడా చెప్పాడు. మరి అలాంటి సమయంలో సాయికి ధైర్యం చెప్పి, ఆ సీన్లు బాగా రావడానికి దోహదం చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు డైరెక్టర్ అనుకుంటున్నారా? అయితే మీరు సీన్లో కాలేసినట్టే. రొమాన్స్ పండించలేక ఇబ్బంది పడుతున్న సాయితో కాసేపు విడిగా ముచ్చటించి అతనిలో సిగ్గును పోగొట్టింది హీరోయిన్ రెజీనా అట. ఈ విషయం కూడా మనవాడే చెప్పాడు. తన అనీజీనెస్ వల్ల స్క్రీన్‌పై ఇద్దరి మధ్య కెమిస్ట్రీలోపం తలెత్తే అవకాశం ఏర్పడిందన్నాడు. దీంతో తన సమస్య తెలుసుకున్నరెజీనా సదరు సీన్లు అసౌకర్యం లేకుండా ఎలా చేయాలి? అనేది తనతో చర్చించి తనను కన్విన్స్ చేసిందని చెప్పాడు సాయి.
Subscribe to:
Post Comments (Atom)
Tollywood 2017: Star Of The Year Natural Star Nani
In Any Field Hard work always pays! One has to agree that it is true looking at Nani’s recent success at the box office. After goin...


-
Sindhu's first international project, directed by Brad Peter, is about an Indian girl who falls in love with an Englishman.“The film cap...
-
Akkineni Akhil’s “Hello” is performing well at USA box-office. The film grossed 210k dollars from Premiere Shows which is more than the ...
-
MCA is the second attempt of director Venu Sriram at making it big. The film stars Nani, who is now considered as the most bankable star....

No comments:
Post a Comment