Thursday, January 7, 2016

మంచి క్రేజ్‌ మధ్య విడుదలవుతోంది

రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాల్ని జనాలు పట్టించుకోవడం కూడా మానేసిన రోజులొచ్చేశాయి ఈ మధ్య. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా '365 డేస్‌' వచ్చిన సంగతి, వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. వరుసగా దారుణమైన సినిమాలు తీసి తనకున్న రెపుటేషన్‌ మొత్తం పోగొట్టుకున్నాడు వర్మ. గతంలో లాగా వర్మ పబ్లిసిటీ జిమ్మిక్కులు కూడా పని చేయడం మానేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత వర్మ ముద్ర కనిపించి.. ఆసక్తి రేపిన సినిమా 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. దీని ప్రోమోస్‌, ట్రైలర్స్‌, అందులోని విజువల్స్‌ సినిమా మీద కలిగించాయి. దీనికి తోడు జనవరి 1న విడుదలైన కన్నడ వెర్షన్‌ కు అద్భుతమైన రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో తెలుగులో మంచి క్రేజ్‌ మధ్య గురువారం విడుదలవుతోందీ సినిమా. సంక్రాంతికి భారీ సినిమాలు వరుస కడుతున్న నేపథ్యంలో ఈ వారం ఓ మోస్తరు సినిమా కూడా మరేదీ విడుదల కావట్లేదు. దీంతో సోలోగా మంచి క్రేజ్‌ మధ్య విడుదలవుతోంది 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. థియేటర్లు కూడా బాగా ఇచ్చారీ సినిమాకు. ముందే పాజిటివ్‌ టాక్‌ ఉన్న నేపథ్యంలో చాన్నాళ్ల తర్వాత వర్మ సినిమాకు థియేటర్లు కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్షన్లు కూడా బాగానే వచ్చే ఛాన్సుంది.

No comments:

Post a Comment