Thursday, January 7, 2016

డిక్టేటర్‌ కాపీ సినిమానా?

గతంలో హాలీవుడ్‌ సినిమాల్ని డిట్టో దించేసినా జనాలకు తెలిసేది కాదు. కానీ ప్రపంచ సినిమా అంతా మన అర చేతుల్లోకి వచ్చేసిన ఈ రోజుల్లో ఒక చిన్న సన్నివేశాన్ని కాపీ కొట్టినా దొరికిపోతున్నారు. సినిమా ఇంకా రిలీజ్‌ కాకముందే ట్రైలర్‌ చూసేసి ఇది ఫలానా సినిమాకు కాపీ అని చెప్పేస్తున్నారు జనాలు. ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడెందుకంటే సంక్రాంతికి రాబోతున్న బాలయ్య సినిమా 'డిక్టేటర్‌' హాలీవుడ్‌ సినిమాకు కాపీ అన్న చర్చ జరుగుతోంది టాలీవుడ్లో. 'ది ఈక్విలైజర్‌' అని గత ఏడాది విడుదలై పెద్ద హిట్టయిన హాలీవుడ్‌ మూవీ నుంచి స్ఫూర్తి పొంది 'డిక్టేటర్‌' కథ తయారు చేసినట్లు చెబుతున్నారు. 'డిక్టేటర్లో' హీరో సూపర్‌ మార్కెట్లో సూపర్‌ వైజర్‌ గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటారు. ఐతే ఆపదలో ఉన్న హీరోయిన్ని కాపాడే ప్రయత్నంలో అతను గతంలో పెద్ద మాఫియా డాన్‌ అని వెల్లడవుతుంది. తర్వాత ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలవుతుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ ముగిశాక హీరో మళ్లీ డాన్‌ అవతారమెత్తి విలన్‌ గ్యాంగు పని పడతాడు. ఇది 'బాషా' రోజుల నుంచి చూస్తున్న ఫార్మాటే కానీ.. సినిమాలో ఇంకేదో వెరైటీ పాయింట్ట్రీ ఉందని.. ట్రీట్మెంట్‌ భిన్నంగా ఉంటుందని అంటున్నారు. హాలీవుడ్‌ సినిమా నుంచి పాయింట్‌ తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగ్గ ట్రీట్మెంట్‌ తో స్క్రిప్టు తయారు చేయించాడట శ్రీవాస్‌. ఐతే సినిమాలో బాలయ్యది డ్యూయల్‌ రోల్‌ అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

No comments:

Post a Comment