Showing posts with label Tollywood hot news. Show all posts
Showing posts with label Tollywood hot news. Show all posts

Friday, December 22, 2017

బాహుబలి-2ను ఆ సినిమా కొట్టేసిందే.

2017లో బిగ్గెస్ట్ హిట్ ఏదంటే సౌత్ నుంచి నార్త్ వరకు ఎవరైనా ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనేస్తారు. అందుకు వసూళ్లే నిదర్శనం. వసూళ్ల మాట పక్కన పెట్టేసినా.. కంటెంట్ పరంగా కూడా ఇది బలమైన సినిమానే. ఐతే ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ ప్రకటించిన 2017 ఇండియన్ టాప్-10 మూవీస్ జాబితాలో మాత్రం ‘బాహుబలి: ది కంక్లూజన్’కు అగ్రస్థానం దక్కలేదు. ఈ చిత్రం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో డైరెక్టర్ ద్వయం గాయత్రి-పుష్కర్ రూపొందించిన తమిళ థ్రిల్లర్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమా ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించడం విశేషం. అలాగని ఇది ఐఎండీబీ సంస్థ స్వయంగా ప్రకటించిన జాబితా అనుకునేరు.

ఐఎండీబీ యూజర్స్ అయిన సామాన్య ప్రేక్షకుల రేటింగ్ ఆధారంగానే ఈ జాబితా ప్రకటించారు. ‘బాహుబలి-2’ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ను పక్కన పెట్టి సామాన్య ప్రేక్షకులు ‘విక్రమ్ వేద’ లాంటి రీజనల్ మూవీకి పట్టం కట్టడం విశేషం. ఇక ఈ జాబితాలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ కాకుండా ఇంకో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం విశేషం. సెన్సేషనల్ ‘అర్జున్ రెడ్డి’కి ఈ లిస్టులో మూడో స్థానం దక్కింది. రానా మూవీ ‘ఘాజీ’ ఆరో స్థానం సంపాదించింది. అమీర్ ఖాన్ నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్ నాలుగో స్థానంలో నిలవగా.. ఇర్ఫాన్ ఖాన్ మూవీ ‘హిందీ మీడియం’ ఐదో స్థానం సంపాదించింది. అక్షయ్ కుమార్ సినిమాలు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. ‘జాలీ ఎల్ఎల్బీ-2’ వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. విజయ్ ‘మెర్శల్’ మూవీ 9.. మమ్ముట్టి ‘ది గ్రేట్ ఫాదర్’ 10 స్థానాలు సాధించాయి.

బ్యాక్ లెస్ లో బాపు బొమ్మ


నేచురల్ స్టార్.. వాళ్ల ముచ్చటెందుకు కాదనాలి?

యువ కథానాయుడు నానికి కెరీర్ ఆరంభంలోనే నేచురల్ పెర్ఫామర్ అనే పేరొచ్చింది. రెండేళ్ల కిందట ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో అతడి పేరు ముందు నేచురల్ స్టార్ అనే బిరుదు వేశారు. అప్పుడా విషయాన్ని అందరూ సరదాగా తీసుకున్నారు. తమాషాగా ఆ ట్యాగ్ తగిలించారేమో అనుకున్నారు. కానీ ఆ సినిమాలో నాని పెర్ఫామెన్స్ చూశాక మాత్రం అందరూ ఇంప్రెస్ అయి.. నిజంగానే నాని నేచురల్ స్టార్ అన్నారు. తర్వాత తర్వాత అది బాగా పాపులరైంది. నాని పేరునిప్పుడు ఎవరూ అలాగే పలకట్లేదు. ‘నేచురల్ స్టార్ నాని’ అనే అంటున్నారు. మామూలుగా చాలా సింపుల్‌గా ఉంటూ.. ఎంతమాత్రం స్టార్ లాగా ప్రవర్తించని నానికి ఇలాంటివి ఇష్టముండవేమో అనుకుంటాం. కానీ ప్రతి సినిమాలో నాని పేరు ముందు ‘నేచురల్ స్టార్’ అని పడుతుండటంతో అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే భావించాలి.

ఇదే విషయంలో నాని దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘‘ఇంతకుముందు నేచురల్ స్టార్ లాంటివి తన పేరు ముందు అవసరం లేదని తాను దర్శక నిర్మాతలు చెప్పేవాడినని.. కానీ వాళ్లు వినేవాళ్లు కాదని నాని చెప్పాడు. ఐతే జనాలు ఎక్కడికెళ్లినా నేచురల్ స్టార్ నేచురల్ స్టార్ అనడం గమనించానని... వాళ్లంత ప్రేమగా పిలుచుకుంటున్నపుడు.. అలా ఫిక్సయిపోయినపుడు తాను మరీ పట్టుబట్టి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని అనిపించిందని నాని అన్నాడు. అందుకే తన పేరు ముందు ‘నేచురల్ స్టార్’ అని వేస్తుంటే ఇప్పుడేమీ అభ్యంతరం చెప్పట్లేదని.. ఇలాంటివి వద్దు అన్న ఫీలింగూ లేదని.. అలాగే కావాలని కూడా లేదని.. ఏ అభిప్రాయం లేకుండా తటస్థంగా ఉంటున్నానని నాని తెలిపాడు.

టాక్ ఎలా ఉన్నా.. నాని కుమ్మేశాడు

ఈ గురువారం రిలీజైన నాని కొత్త సినిమా ‘ఎంసీఏ’కు టాక్ ఆశించినంత గొప్పగా లేదు. రివ్యూలన్నీ యావరేజ్ అన్నట్లుగానే వచ్చాయి. సోషల్ మీడియాలో జనాల స్పందన కూడా మిక్స్‌డ్‌గా ఉంటోంది. రొటీన్ కథ అని.. సెకండాఫ్ తేలిపోయిందని.. అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నారు. ఐతే ఈ టాక్‌కు, తొలి రోజు వసూళ్లకు అసలు పోలికే లేదు. ఈ చిత్రానికి ఫస్ట్ డే కళ్లు చెదిరే వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని సినిమా ఫస్ట్ డే వసూళ్ల రికార్డును ‘ఎంసీఏ’ భారీ తేడాతో దాటేసినట్లు అంచనా. నాని లాస్ట్ మూవీ ‘నిన్ను కోరి’ తొలి రోజు రూ.6.5 కోట్ల షేర్ రాబట్టగా.. ‘ఎంసీఏ’ ఫస్ట్ డే షేర్ రూ.9.5-10 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే వాస్తవమైతే షాకవ్వాల్సిందే. తొలి రోజు పది కోట్ల షేర్ అంటే పెద్ద పెద్ద స్టార్లకు మాత్రమే సాధ్యమయ్యే విషయం.

చాన్నాళ్లుగా సరైన సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు కొంచెం పెద్ద స్థాయి సినిమా కోసం ఆవురావురుమని ఉన్నారు. కొన్ని వారాలుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గురువారం మాగ్జిమం థియేటర్లలో ఈ సినిమాను వేసేశారు. దిల్ రాజుకు పట్టున్న నైజాం ఏరియాలో అయితే 70 శాతానికి పైగా థియేటర్లలో తొలి రోజు ఈ చిత్రాన్ని ఆడించారు. దాదాపుగా అన్ని చోట్లా హౌస్ ఫుల్సే పడ్డాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ఏకంగా నాలుగు థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే.. ఆ నాలుగు థియేటర్లలో నాలుగు షోలూ తొలి రోజు హౌస్ ఫుల్స్ పడటం విశేషం. టాక్ వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదనడానికిది రుజువు. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రిమియర్లతోనే 3 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. తొలి రోజు వసూళ్లు కూడా పర్వాలేదంటున్నారు. శుక్రవారమే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును దాటేసే అవకాశముంది.

Tweet Review: 'Hello', first day, first show

Hello experience and all the excitement of this gripping fare live via tweet review.
Hello. U Certificate. 131 mins.
"Hello" begins with Nagarjuna's voice over.
Akhil appears on screen with the title song.
Akhil is narrating that he has been waiting for Junnu, his childhood girlfriend for the last 14 years.
Akhil's phone is stolen by a theif. Now Akhil is chasing him. First ever chase fight sequence on Hyderabad metro
Childhood episodes have begun.
Flashback to Akhil's child hood, when he was orphan. He meets a small child at a panipuri center. Her name is Junnu.
The two kids are bonding.
"Anaganga Oka Ooru" song is going on.
How rich couple Jagapathi Babu and Ramya Krishna have adopted him is explained.
Junnu's parents moved to Delhi. So both kids were separated.
End of flashback. This episode took running time of 25 minutes.
Kalyani Priyadarshan enters. She is Junnu. Her name is Priya.
Story cuts back to present - Akhil is trying to get back his stolen phone. It is revealed that an organized gang that steals mobile phones and sells it off as refurbished second hand phonnes.
Here comes a stunning chase stunt performed by Akhil.
Interval.
Post interval, villain Ajay enters the scene. Another fight sequence.
Ajay is the gang leader of mobile theft mafia.
Story moves to back 7days.
Priya comes down to Hyderabad in search of Seenu.
Accidentally Priya and Seenu aka Avinash meet.
Priya does not he is Seenu, he doesn't she is Junnu.
Movie is turning bore.
Now time for song "Evevo kalalu Kanna..." which was sung by Akhil himself.
Movie is progressing slowly
Now comes another song - "merise merise".
End of second flashback.

ఆ గ్రూపుకు కొత్త గ్రూపు పోటీ వస్తోంది


స్టార్ హీరోయిన్స్ గా వారికంటు ఓ గుర్తింపును తెచ్చుకోవాలంటే ఈ కాలంలో పోటీ మాములుగా ఉండడం లేదు. ఏ మాత్రం అపజయం అందుకున్నా కూడా నార్త్ భామలు వచ్చి ఛాన్సులు లాగేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సౌత్ బ్యూటీస్ కూడా వారి అదృష్టాన్ని చాలా సక్సెస్ గా పరీక్షించుకున్నారు. ఏ మాత్రం తొందర పడకుండా వారికి సెట్ అయ్యే కథలని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అంటే ఓ గ్రూప్ ఉంది. శ్రుతి హాసన్ - కాజల్ - అనుష్క అలాగే తమన్నా - సమంత వంటి తారలు స్టార్ హీరోలతో ఎక్కువగా సినిమాలని చేస్తున్నారు దర్శకులు కూడా కొత్త హీరోయిన్స్ ని తీసుకొని రిస్క్ చేయడం ఎందుకని స్టార్ హీరోయిన్స్ కి భారీ పారితోషకం ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే వీరి స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోలేకపోయినా కూడా కొంత మంది భామలు వారికి గట్టి పోటీని ఇస్తున్నారు.

ఆ జాబితాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి స్మైలీ గర్ల్ నివేత థామస్ - క్యూట్ హీరోయిన్ అను ఇమ్మన్యుయల్  ఇంకా అందంతో పాటు అమాయకంగా కనిపించే కీర్తి సురేష్ వంటి తారలు అభిమానుల మనసుని చాలానే గెలుచుకున్నారు. గ్లామర్ షోలతో వీరు అంతగా ఆకట్టుకోలేక పోయినా కూడా వారి స్టైల్ లో న్యాచురల్ గా కనిపిస్తూ.. మంచి అవకాశాల్ని దక్కించుకుంటున్నారు. మరికొంత కూడా ఉన్నారు. మరి వీరి టాలెంట్ తో ఎంతవరకు ఇలా అవకాశాలను  దక్కించుకుంటారో చూడాలి.

తొలి ప్రేమ.. తప్పులో కాలేశారా?

క్లాసిక్ లాగా నిలిచిపోయిన సినిమాల్ని ఏ రకంగా టచ్ చేసినా అది సాహసమే అవుతుంది. అలాంటి సినిమాల్ని రీమేక్ చేసినా.. వాటిని మరో రకంగా వాడుకోవాలని చూసినా ఫలితం తేడా కొట్టేస్తుంటుంది.  దిల్ రాజు లాంటి మంచి అభిరుచి ఉన్న నిర్మాత ‘మరో చరిత్ర’ను ఈ ట్రెండుకు తగ్గట్లు రీమేక్ చేసే ప్రయత్నం చేశాడు. అది దారుణంగా బెడిసికొట్టింది. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్ టైటిల్ తీసుకుని.. ఈ మధ్య నిఖిల్ హీరోగా ఒక సినిమా తీశారు. దాని ఫలితమేంటో తెలిసిందే. కాబట్టే గొప్ప సినిమాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

ఐతే పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన.. తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ అనిపించుకున్న ‘తొలి ప్రేమ’ సినిమాను వాడుకోవడానికి నిర్ణయించుకుంది వరుణ్ తేజ్ కొత్త సినిమా టీం. ఈ చిత్రానికి ఏకంగా ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ పెట్టేశారు. ఈ టైటిల్ వెంటనే జనాల్ని ఆకర్షించేసరికి టీం అంతా ఖుషీ అయిపోయింది. దీని టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ ఓకే అనిపించాయి. ‘తొలి ప్రేమ’ స్థాయి మంచి ప్రేమకథ చూడబోతున్నామనే ఆసక్తి కనిపించింది.

కానీ ఇప్పుడు ‘తొలి ప్రేమ’ టీజర్ చూశాక అందరూ ఒక్కసారిగా డిజప్పాయింట్ అయిపోయారు. ఏముంది ఈ టీజర్లో అని పెదవి విరిచేశారు. ఫస్ట్ లవ్ ను ఎవరూ మరిచిపోలేరన్న ఒక రొటీన్ డైలాగ్ మినహాయిస్తే ఇందులో ఏ విశేషం లేదు. టీజర్లో అసలేమాత్రం ఫీల్ కనిపించలేదు. ఇంకో టైటిల్ పెట్టుకుని ఈ టీజర్ లాంచ్ చేసి ఉంటే రెస్పాన్స్ ఎలా ఉండేదో కానీ.. ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ తో ఇలా ఏ స్పెషాలిటీ లేని టీజర్ వదిలేసరికి నిరాశ వ్యక్తమైంది. ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ పెట్టుకుని జనాల్ని ఆకర్షించారు కానీ.. ఇప్పుడు ఆ క్లాసిక్ తాలూకు బర్డెన్ మోయాల్సి వస్తోంది. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడం ఇప్పుడు వీరికి పెద్ద సవాలు. మరి ట్రైలర్ చూశాక జనాల ఫీలింగ్ ఎలా ఉంటుందో.. సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

ఇలాగైతే కష్టమే నాని

ఏమన్నా అంటే అన్నాం అంటారు కాని.. రోజూ అదే రొటీన్ సినిమాతో వస్తే ఎట్టాగబ్బా? ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని పరిస్థితి అలాగే ఉంది. రొటీన్ కథలతో ఫుల్ కామెడీని నింపేసి ఆ మధ్యన భలే భలే మగాడివోయ్.. నేను లోకల్ అంటూ భారీ హిట్లు కొట్టాడు. ఒక సినిమాతో 25+ కోట్లు వసూలు చేస్తే.. మరో సినిమాకు 34+ కోట్లు షేర్ వచ్చింది. అందుకని.. ఆ చెప్పండి.. అందుకుని.. అవే తీస్తారా? అంటున్నారు నెటిజన్లు.

నిజానికి ఎం.సి.ఏ సినిమా విషయంలో నాని చేసిన ప్రామిస్ లు.. దిల్ రాజు కొట్టిన పంచులు.. సిక్స్ కొడతా సిక్స్ కొడతా అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వినేసరికి.. అందరూ సినిమా ఇరగాడేస్తుంది కాబోలు అనుకున్నారు. ఇక ఆడటం వసూలు చేయడం అనే విషయాలు పక్కన పెట్టేస్తే.. అసలు సినిమాలో కంటెంట్ బాగా డల్ అయిపోయింది అనేది మెజార్టీ ఆడియన్స్ ఉవాచ. కామెడీ గట్టిగా ఉంటే కథ లేకపోయినా సరిపోయేది.. కామెడీ కూడా లేకపోవడంతో.. కథ లేదనే విషయం తెలిసిపోయింది. అందుకే అటు మార్చి ఇటు మార్చి రేసుగుర్రం సినిమానే తీశారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. పైగా.. ఎన్నాళ్ళని ఇలాంటి సినిమాలే చేస్తావ్ నాని? అంటూ సినిమా లవర్స్ ప్రశ్నించడం ఇప్పుడు మనం గమనించవచ్చు.

తనకంటూ ఒక మంచి మార్కెట్ ఇమేజ్ అన్నీ ఉన్నప్పుడు.. నాని వంటి హీరో తెలుగు సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించవచ్చు. మలయాళంలో చేసే ప్రయోగాలు.. హిందీలో వచ్చి ఫారిన్ ప్రేమకథలు..లేదంటే ఆఫ్ బీట్ తరహా సినిమాలు. నాని అవేమన్నా ప్రయత్నిస్తే బాగుంటుందేమో అంటూ చాలామంది సూచనుల చేస్తున్నారు. చూద్దాం నాని ఎలా రియాక్ట్ అవుతాడో.

ఫోటో స్టోరి: పోకిరి పిల్ల మారలేదు

సినిమాలో హాట్ గా కనిపించే కొంతమంది నటీమణులు ఒక్కోసారి చాలా ఫేమస్ అవుతుంటారు. కనిపించింది ఒక్క సినిమాలోనే అయినా ఎక్కడైనా చూస్తే ప్రేక్షకులు ఈజీగా గుర్తుపట్టేస్తారు. అయితే టాలీవుడ్ సినిమాలో అప్పటివరకు ఉన్న రికార్డులను ఒక్కసారిగా బద్దలు కొట్టిన సినిమా పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 2006 లో వచ్చిన ఆ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.

అయితే ఆ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. పూరిజగన్నాథ్ డైలాగ్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ని గుర్తు పట్టేలా చేసిందని చెప్పాలి. అయితే అందులో విలన్స్ గ్యాంగ్ లో ఉండే ఓ భామ అందరికి గుర్తే ఉంటుంది. సైడ్ కిక్ పాత్రలో హాట్ గా కనిపించిన జ్యోతి రానా మహేష్ ని రెచ్చగొట్టేలా ట్రై చేస్తుంటుంది. అమ్మడి పాత్ర ఓ వర్గం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇకపోతే అమ్మడు 2006 వరకు బాగానే బిజీగా ఉన్నా ఆ తర్వాత మళ్లీ సౌత్ వైపు రాలేదు.

కానీ బాలీవుడ్ లో అరకొర సినిమాలతో బాగానే పాపులర్ అయ్యింది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో సడన్ గా దర్శనం ఇచ్చింది. ఆమెకు సంధించిన ఫొటో ఒకటి చాలా వైరల్ అవుతోంది. యెల్లో - బ్లాక్ కలర్ డ్రెస్ లోహాట్ స్టీల్ ఇస్తూ నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది. ఏ మాత్రం అనుమానం రాకుండా వల్గర్ గా లేకుండా ఓ రకం అందాలను బాగానే ప్రెజంట్ చేసింది. ఫొటోని చూస్తోన్న చాలా మంది పోకిరి పిల్ల అందంలో ఏం మారలేదు అంటున్నారు. 

Thursday, December 21, 2017

జగపతికి పోటీగా కోటి రూపాయల ఆర్టిస్ట్

టాలీవుడ్ లోకి తమిళ హీరోలు విలన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఎక్కువవుతోంది. ధృవతో అరవింద్ స్వామి.. లై మూవీతో అర్జున్.. ఇప్పుడు సవ్యసాచితో మాధవన్.. తెలుగు తెరపై విలన్స్ గా మారిపోతున్నారు. హీరోలుగా బోలెడంత ఇమేజ్ ఉన్న వీరిని.. భారీ మొత్తమే ముట్టచెప్పి మరీ విలన్స్ గా మారుస్తున్నారు మన టాలీవుడ్ మేకర్స్.

అయితే.. ఇది మనోళ్లకు మాత్రమే పరిమితం కాదు. జగపతి బాబు కూడా ఇలాంటి ట్రెండ్ లోనే ఉన్నాడు. అసలు ఈ ట్రెండ్ మొదలైనదే జేబీతో అని చెప్పచ్చు. మలయాళ.. తమిళ రంగాల్లో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేసేసి.. భారీ మొత్తాన్ని అందుకుంటున్నాడు జగపతి బాబు. అయితే.. అటు ఇమేజ్.. ఇటు యాక్టింగ్ స్కిల్స్ ఉండి.. అందరికీ తెలిసిన నేటివ్ పర్సన్ కావడంతో మొదట జగపతికి ఎలాంటి పోటీ లేకపోయింది. ఇప్పుడు మాధవన్ ను కూడా విలన్ గా మార్చేస్తోంది టాలీవుడ్. నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా.. టాలీవుడ్ లో ఇతడికి చాలానే ఇమేజ్ ఉంది.

సఖి చిత్రం అందించిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఎటొచ్చీ అరవింద్ స్వామికి విలన్ గా కంటిన్యూ అయే ఉద్దేశ్యం లేదని చెప్పేశాడు. కానీ మాధవన్ అలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. దీంతో జగపతికి పోటీగా నిలిచేందుకు మాధవన్ రెడీ అవుతున్నడానే టాక్ వినిపిస్తోంది. పైగా ఒక్కో మూవీకి మినిమం కోటి రూపాయల పారితోషికం గిడుతున్నపుడు హీరో పాత్ర అయితే ఏంటి.. విలన్ పాత్ర అయితే ఏంటి.. అంతే కదా!

నానిది బ్రేకుల్లేని బండేనా?

2014 మార్చిలో విడుదలైన ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెడితే.. ఈ ఏడాది జులైలో వచ్చిన ‘నిన్ను కోరి’ వరకు నానికి ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మధ్యలో ‘మజ్ను’ ఒక్కటి యావరేజ్‌గా ఆడింది. మిగతా సినిమాలన్నీ సక్సెస్ అయినవే. అందులో కొన్ని హిట్లున్నాయి. కొన్ని సూపర్ హిట్లున్నాయి. ఇంకొన్ని బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. సక్సెస్ రేట్ చాలా తక్కువైన ఫిలిం ఇండస్ట్రీలో ఇంత నిలకడగా.. వరుసగా హిట్లు కొట్టడం అన్నది మామూలు విషయం కాదు. ఈ ఏడాది ‘నేను లోకల్’ లాంటి బ్లాక్ బస్టర్.. ‘నిన్ను కోరి’ లాంటి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు నాని. ఇప్పుడు ‘ఎంసీఏ’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరి నాని విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందా.. బ్రేక్ పడుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారందరూ.

గత రెండు మూడేళ్లలో యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా తన పెర్ఫామెన్స్‌తో లాక్కొచ్చేశాడు నాని. ‘ఎంసీఏ’ టీజర్, ట్రైలర్ చూస్తే కంటెంట్ పరంగా అది కొత్తగా.. అంత గొప్పగా ఉంటుందన్న అంచనాలేమీ కలగలేదు. రొటీన్ ప్లాట్‌తోనే ఎంటర్టైన్ చేసే ప్రయత్నం జరిగినట్లుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఏమేరకు వర్కవుటవుతుందన్నదే కీలకం. సినిమాకు నాని సగం బలం అనడంలో సందేహం లేదు.

 ఓ మోస్తరుగా టైంపాస్ చేస్తూ నడిచిపోయినా సినిమా గట్టెక్కేస్తుంది. మరి వేణు శ్రీరామ్ సినిమాను ఎలా తీసుకెళ్లాడో చూడాలి. శ్రీరామ్ తొలి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ను దృష్టిలో పెట్టుకుని చూస్తే అతను అద్భుతాలేమీ చేస్తాడన్న అంచనాల్లేవు. ఐతే నిర్మాత దిల్ రాజు మాత్రం అతడిపై.. ‘ఎంసీఏ’పై భరోసాతో ఉన్నాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే.. ఓవర్లో ఆరో బంతికి కూడా సిక్సర్ కొట్టేస్తున్నా అంటున్నాడు. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఎంసీఏ’కు ఎలాంటి టాక్ వస్తుందో.. దీని వసూళ్లెలా ఉంటాయో చూద్దాం.

Wednesday, December 20, 2017

నేను, అఖిల్ ప్రేమగానే ఉన్నాం

జస్ట్ 24గంటల తేడాలో వస్తున్నాయి ఎంసీఏ, హలో సినిమాలు. రిలీజ్ డేట్స్ విషయంలో ఈ రెండు సినిమాల నిర్మాతలు (దిల్ రాజు, నాగార్జున) మధ్య చిన్నచిన్న అభిప్రాయ బేధాలు వచ్చిన మాట కూడా వాస్తవం. నాగార్జున, దిల్ రాజు ఆడియన్స్ కు ఎంత సర్దిచెప్పినా పోటీ మాత్రం తప్పలేదు. అయితే దీనిపై నాని మరోలా రియాక్ట్ అయ్యాడు.
"అంతా అనుకుంటున్నట్టు నాకు, అఖిల్ కు మధ్య పోటీ లేదు. నాకు తెలిసి రెండు సినిమాలూ హిట్ అవుతాయి. ఇదే విషయంపై నేను అఖిల్ ఛాట్ చేసుకున్నాం. ప్రేమగా మెసేజ్ లు కూడా పెట్టుకున్నాం. మేమిద్దరం ప్రేమగానే ఉన్నాం. కొందరు మాత్రం లేనిపోని పోటీ సృష్టించారు." ఎంసీఏ, హలో సినిమాల మధ్య పోటీపై నాని వెర్షన్ ఇది.
హలో సినిమా ట్రయిలర్ చూసి వెంటనే అఖిల్ కు ఫోన్ చేసి మెచ్చుకున్నానని, ఎంసీఏ ట్రయిలర్ కూడా బాగుందంటూ విక్రమ్ కుమార్, అఖిల్ తనకు కాల్స్ చేశారని నాని చెప్పుకొచ్చాడు. అసలు తమ మధ్య జరిగిన ఛాటింగ్ ను పబ్లిక్ లో పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఒక దశలో తనకు వచ్చిందంటున్నాడు నాని. 
ఎటొచ్చి నాని చెప్పేదేంటంటే.. హీరోలు లేదా సినిమాల మధ్య పోటీనే ఉండదట. మార్కెట్లో ఎన్ని సినిమాలున్నా బాగున్న సినిమానే ఆడుతుందట. కాబట్టి ఎంసీఏ, హలో రెండూ ఆడుతాయంటున్నాడు. మరి రేపు హలో సూపర్ హిట్ అయి, ఎంసీఏ ఫ్లాప్ అయితే నాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

'Arundhati' Anushka Stuns As Bhaagamathie

Bhaagamathie has thrown a stunning surprise with its first look poster itself. The poster was stunnigly gruesome and hard hitting.

Now the teaser of Bhaagamathie shocks its viewers with 'terrifying' visuals. The setup looks like it is yet another horror/thriller in the lines of Arundhati. The last shot in the teaser will leave you awestruck for sure.

Directed by Ashok this visually rich horror film is bankrolled by UV Creations. Thaman has come up with a captivating score yet again. Unni Mukundan and Jayram play important characters in the film.

It is a shockingly stunning tease that gets full attention without revealing much. It will leave us intrigued for the upcoming theatrical trailer cut. 

Varun Tej's Emotional Take On First Love : Teaser


Fidaa star Varun Tej's upcoming romantic drama Tholi Prema teaser is out. It just talks about the theme of the film in a single dialog.
"Mana jeevitamloki enthamandi ammayilu vachi vellina manam preminchina modati ammayini marchipolem," sums up the theme and title of the film.
It is an emotional teaser with Varun looking at his best in the bearded avatar.
Raashi Khanna plays the female lead in this romantic drama produced by BVSN Prasad and directed by debutant Venky Atluri. Thaman is the music composer. 

Andhra news, Andhra Politics, Telangana news, Tollywood News, Bollywood telugu movie news, latest telugu movie news, movie photos, gossips, videos, review, telugu movie review,tollywood latest,movie trailers

Akhil All Set For A Surprise

By now, it is known that Hello is the film made by Annapurna Studios for Akhil. The film's producer is Nagarjuna and his younger son Akhil is playing the lead in the film. But Akhil hasn't been paid a penny till now for acting in the film, says Nagarjuna.
However, there is a catch here. If the film turns out to be a hit, Akhil will be getting Rs 2 crore. Well, he will not receive the amount in cash, but he will get a thoughtful gift from his doting father.
According to latest buzz from Film Nagar, Nagarjuna is said to be planning to gift an imported car worth Rs 2 crore to his son.
As of now, both Akhil and Nag are totally busy in promoting the film big time. Hello is set for release this Friday.

Andhra news, Andhra Politics, Telangana news, Tollywood News, Bollywood
telugu movie news, latest telugu movie news, movie photos, gossips, videos, review, telugu movie review,tollywood latest,movie trailers
 

Tuesday, December 19, 2017

అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ లైవ్

Why Chiru Apologized to KTR?

Megastar Chiranjeevi, who on Monday attended the Prapancha Telugu Mahasabhalu event that is being organized by Telangana govt., thanked CM K. Chandrasekhara Rao and also narrated the incident when he had apologized to IT Minister KTR.
"I sincerely thank CM KCR garu for making me a part of this beautiful event. The kind of work KCR is doing for the preservation of Telugu language is praiseworthy. Organizing this event itself is a proof of how much he respects and loves Telugu language. On behalf of the whole film industry, I thank him for the thoughtful gesture of felicitating Telugu film artistes during this event.

It was a historic decision to make Telugu language mandatory from 1st to 12th standard in the schools of Telangana. KCR's efforts for restoration of Telugu is inspiring," said Chiru, praising KCR to the sky.

During his speech, Chiru also narrated the incident when he apologized to KTR.

"When KTR invited me for this event, I immediately agreed to attend. During our conversation, I congratulated him on winning a prestigious award recently. To that, he said, Anna..(brother), how pertinent it is to wish me in 'English' when I came to invite you for 'Telugu' mahasabhalu. Although he just joked, I realized that we knowingly or unknowingly neglect our mother tongue. I apologized to him then and there.

How heartening it will be to talk in pure Telugu instead of English or any other convoluted language when two Telugu persons meet. I wish every Telugu person strive for the preservation of our language," the Megastar concluded his speech.'

హలో: ఆట కావాలా.. పాట కావాలా!

అఖిల్ అమెరికా నుంచి తిరిగి రాగానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఎనౌన్స్ చేస్తామని ప్రకటించాడు నాగ్. చెప్పినట్టుగానే ఈనెల 20న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ఉండబోతోందని తెలిపాడు. కాకపోతే అది ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కాదు. అంతకు మించి.
అవును.. హలో కోసం సరికొత్త ప్రచార కార్యక్రమానికి తెరతీశాడు నాగ్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ స్థానంలో సరికొత్త డాన్స్ ప్రొగ్రామ్ పెట్టాడు. దీనికి 'హలో-సింగ్ & డాన్స్' అనే పేరు పెట్టాడు. అంటే కేవలం స్టేజ్ ఎక్కి ప్రసంగాలు మాత్రమే చేయకుండా సరదాగా ఆడి, పాడే షో అన్నమాట.
ఇదే పనిని కొన్ని రోజుల కిందట అమెరికాలో చేశాడు అఖిల్. న్యూజెర్సీ, డాలస్, శాన్ జోస్ లో లైవ్ షో ఇచ్చాడు. తనే స్వయంగా ఆడిపాడాడు. యాజ్ ఇటీజ్ గా ఇదే కాన్సెప్ట్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కొంతమంది అభిమానులతో అఖిల్ ఆడిపాడబోతున్నాడు.
ఎన్-కన్వెన్షన్ లో రేపు ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకాబోతున్నాడు. హలో సినిమా ప్రమోషన్ కు సంబంధించి, రెగ్యులర్ గా ఇచ్చే ఇంటర్వ్యూలు లాంటివి పక్కనపెట్టి ఇలా కొత్తగా ప్లాన్ చేశాడు నాగ్.

Saturday, December 16, 2017

Hot News : Chiranjeevi Secret Funding For SIL Film?

Chiranjeevi's son in law Kalyan Kanuganti is all set to make debut as an actor soon. His first film will be produced by Sai Korrapati of Vaarahi Chalanachitram.
The news has surprised many as Sai is a very close associate of Balakrishna. He has little acquaintance with Chiranjeevi’s family prior to this.
Then how did Sai Korrapati step in for the maiden venture of Chiru’s SIL?
As per industry buzz, Rajamouli played a role in getting Sai into the mega camp.
When Rajamouli learnt that Chiranjeevi is looking for a good project to launch his son in law, he proposed Sai’s name and then things moved quickly.
Sai Korrapati had introduced director Rakesh Sashi to Chiranjeevi and the rest is history.
Although Sai Korrapati is the official producer of the film, buzz has it that Chiranjeevi has the major share in it.
Only twenty five percent of the production cost will be put by Korrapati and the rest will be from Chiranjeevi’s account.
Chiru wants a grand launch for his son in law. He doesn’t want him to be launched with an ultra low budget film. So he is making sure to have topnotch production values for Kalyan’s debut.

Friday, December 15, 2017

ఇటు అనిరుధ్..అటు అనూప్..దేవికి బ్యాండే

గత రెండు దశాబ్దాల్లో తెలుగు సినిమా మ్యూజిక్ తీసుకుంటే.. దేవిశ్రీది తిరుగులేని ఆధిపత్యం. ఈ రెండు దశాబ్దాల్లో పదుల సంఖ్యలో స్టార్ హీరోల సినిమాలు చేశాడతను. అందులో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్లున్నాయి. తెలుగు సినిమాకు ఒక కొత్త తరహా ఎంటర్టైనింగ్ మ్యూజిక్ ను పరిచయం చేసిన సంగీత దర్శకుడు. కమర్షియల్ మ్యూజిక్ లోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ.. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ సాగిపోతున్నాడతను. ఐతే ఈ మధ్య మాత్రం దేవిశ్రీ మ్యూజిక్ కొంచెం రొటీన్ అయిపోతోందని.. అతను ఒక ఫార్మాట్లో సాగిపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి. దేవి నుంచి వచ్చిన కొత్త ఆల్బం ‘ఎంసీఏ’ అయితే ఏమాత్రం కొత్తదనం లేకుండా తయారరైంది. దేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నిరాశ పరిచింది.. విమర్శలెదుర్కొంది ఈ ఆల్బం విషయంలోనే.

దేవి ‘ఎంసీఏ’ ఆడియో విషయంలో డిజప్పాయింట్ చేసిన టైంలోనే అతడికి పోటీగా ఉన్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అదిరిపోయే ఆల్బంలతో వచ్చారు. అందులో ఒకరు అనూప్ రూబెన్స్. అతను సంగీతం అందించిన ‘హలో’ ఆల్బంకు అద్భుతమైన స్పందన వస్తోంది. విక్రమ్ కుమార్ తో ఇంతకుముందు ‘ఇష్క్’..  ‘మనం’ లాంటి మంచి ఆల్బంలు ఇచ్చిన అనూప్.. ఈసారి వాటికి ఏమాత్రం తగ్గని రీతిలో మంచి ఫీల్ ఉన్న.. రిఫ్రెషింగ్ ఆడియో ఆల్బంతో వచ్చాడు. ఇందులోని పాటలన్నీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు దేవిని కాదని త్రివిక్రమ్ ‘అజ్నాతవాసి’ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్న అనిరుధ్.. అదిరిపోయే ఔట్ పుట్ తోనే వస్తున్నట్లున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘బైటికెళ్లి చూస్తే’.. ‘గాలి వాలుగా’.. పాటలు రెండూ ఇన్ స్టంట్ గా హిట్టయ్యాయి. ఈ సినిమా ఫుల్ ఆడియో ఆల్బం కూడా చాలా బాగా వచ్చిందని.. ఇది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి దేవి వీక్ ఆడియో ఇచ్చిన సమయంలోనే ఇటు అనూప్.. అటు అనిరుధ్ అదిరిపోయే పాటలతో అతడిని ఇరుకున పెట్టారు. ఇక ‘రంగస్థలం’.. ‘భరత్ అను నేను’ ఆడియోలతో దేవి మళ్లీ తన ముద్ర చూపించకుంటే.. అతడికి మున్ముందు కష్టమే అవుతుంది.