Tuesday, January 5, 2016

చరణ్ మదిలో ఆల్టర్నేటివ్?

రామ్ చరణ్..బ్రూస్ లీ వచ్చి, వెళ్లి ఇన్నిరోజులైనా కొత్త ప్రాజెక్టు అఫిషియల్ అన్నౌన్స్ మెంట్ లేదు. థని ఒరువన్ సినిమా చేస్తాడని తెలుసు..గీతా ఆర్ట్స్ నిర్మాణం అనీ తెలుసు. సురేందర్ రెడ్డి డైరక్టర్ అనీ తెలుసు. కానీ ఎప్పుడు? అన్నదే క్వశ్చన్. అయితే ఇప్పుడు చరణ్ వేరే ఆలోచనతో వున్నట్లు వినికిడి. ఓ మాంచి మాస్ సినిమా చేయాలని అనుకుంటున్నాడని టాక్. దానయ్యకు ఓ సినిమా చేయాల్సి వుంది. మరోపక్క సంపత్ నంది లైన్ చెప్పాడని, ఓకె ప్రొసీడ్ అని అన్నాడని టాక్. మరోపక్క మరో కొత్త సంగతి కూడా వినిపిస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజా ఫలితం చూసాక, మేర్లపాక గాంధీకి ఓ చాన్స్ ఇచ్చి చూడాలనుకుంటున్నాడని. థని ఒరువన్ కథకు, నాన్నకు ప్రేమతో కథకు ఎక్కడో దూరపు పోలికలు వుంటాయని, అందువల్ల కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్. మరి ఇదే నిజమైతే, మేర్లపాక గాంధీనా, సంపత్ నందినా ఎవరని ఎంచుకుంటాడు అన్నది మరో క్వశ్చన్. వీటన్నింటికీ అతీతంగా గౌతమ్ మీనన్ ఓ మాంచి పోలీస్ యాక్షన్ స్టోరీ చెర్రీతో చేయాలనుకుంటున్నాడు. మరి దాని సంగతేమిటో?

No comments:

Post a Comment