Monday, January 11, 2016

డబుల్ థియేటర్లు నాన్నకేనంట?

పండగ సినిమాల్లో ఎగ్జిబిటర్లు దేనిపై ఆశలు పెట్టుకున్నారు..దేని వైపు మొగ్గు చూపుతున్నారు అంటే, నాన్నకు ప్రేమతో సినిమాకేనంట. ఫర్ ఎగ్జాంపుల్ అయిదు థియేటర్లు వున్నాయి అనుకుందాం. నాలుగు సినిమాలు నాలుగు థియేటర్లలోవేసి, అయిదో థియేటర్ కు సినిమా అనేసరికి నాన్నకు ప్రేమతో వైపు చూస్తున్నారంట. సాధారణంగా వెయ్యి నుంచి పన్నెండు వందల స్క్రీన్లు వేస్తారు క్రేజ్ వున్న పెద్ద సినిమాలు.కానీ ఈ సారి అంత అవకాశం కనిపించడం లేదు. నాన్నకు ప్రేమతో మొదటి రోజు మాత్రం వెయ్యి నుంచి పన్నెండు వందల స్క్రీన్ లు దొరికేసాయి. మర్నాటికి ఆ సంఖ్య ఏడు ఎనిమిది వందలకు తగ్గిపోతుంది. సోగ్గాడే చిన్నినాయనా దాదాపు 450 నుంచి అయిదు వందల స్క్రీన్ లు వుంటాయి. అలాగే ఎక్స్ ప్రెస్ రాజా కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. ఇక డిక్టేటర్ కూడా నాన్నకు ప్రేమతో సమానంగా ఏడెనిమిది వందల స్క్రీన్ లు వుండొచ్చని వినికిడి. అయితే ఫస్ట్ వీక్ కాగానే ఏ సినిమా వైనా కొన్ని థియేటర్లు లేచిపోవడం ఖాయం. వాటిని మంచి టాక్ తెచ్చుకున్న సినిమా లాక్కొవడం అంతకన్నా ఖాయం. ఇలా అందుకునే సినిమా ఏమై వుంటుంది అన్నది క్వశ్చను. ఎందుకుంటే నాలుగుకు నాలుగు సినిమాలు ప్రామిసింగ్ ఫీడ్ బ్యాక్ తోనే వున్నాయి. అందువల్ల 15వరకు ఏ విషయం తేలదు.

No comments:

Post a Comment