Wednesday, January 6, 2016

'నాన్నకు ప్రేమతో' వెనక్కి వెళ్లవచ్చు

సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ముందుగా వస్తున్నది 'నాన్నకు ప్రేమతో'. 14న డిక్టేటర్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా వస్తుంటే, 15న సోగ్గాడే చిన్నినాయనా విడుదల కానుంది. 13న విడుదలవుతుంది అంటున్నారు కనుక ముందుగా వచ్చేది నాన్నకు ప్రేమతో అనుకోవాలి. కానీ పనులు పూర్తి చేసుకునే విషయంలో మిగిలిన సినిమాల కంటే ఇది బాగా వెనకబడిపోయింది. ఎక్స్‌ప్రెస్‌ రాజా, సోగ్గాడే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిక్టేటర్‌ సెన్సార్‌ లాంఛనాలు కొద్దిసేపటి క్రితమే అయిపోయాయి. కానీ నాన్నకు ప్రేమతో ఎల్లుండికి గానీ సెన్సార్‌కి వెళ్లదు. అది కూడా రఫ్‌ కాపీనే పంపిస్తున్నారని, ఇంకా ఫస్ట్‌ కాపీ కూడా రెడీ కాలేదని తెలిసింది. ఈ లెక్కన మరో వారం రోజుల్లోగా ఈ చిత్రం అన్ని పనులూ పూర్తి చేసుకుని అంతటా సకాలంలో విడుదల కావడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ అనుకున్నట్టుగా పదవ తేదీకల్లా అన్నీ సిద్ధం కాకపోయినట్టయితే 'నాన్నకు ప్రేమతో'ని జనవరి 15న విడుదల చేసినా చేస్తారని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే థియేటర్ల కేటాయింపు పరంగా రసాభాస తప్పదు. ప్రస్తుతానికి పదమూడుకి వచ్చేయాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు కానీ సినిమాని సకాలంలో సిద్ధం చేయడమంటే చాలా అనుకూలించాలి. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకూడదు కదా. అందుకే ఒక రెండు రోజులు ఆలస్యంగా వస్తుందని కూడా ప్రిపేర్‌ అయిపోమంటున్నారు పరిశ్రమ వాసులు. -

No comments:

Post a Comment