Tuesday, May 17, 2016

24.. తెలుగు-తమిళం అంత తేడానా?

నిన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళ డబ్బింగ్ సినిమాల రెవెన్యూ గురించి కొన్ని లెక్కలు చెప్పాడు అల్లు అర్జున్. తెలుగులో సూర్య మార్కెట్ గురించి మాట్లాడుతూ.. తమిళంలో వచ్చే రెవెన్యూతో పోలిస్తే తెలుగులో 20-30 శాతం ఉండొచ్చని అంచనా వేశాడు బన్నీ బాబు. కానీ ‘24' లెక్కలు చూస్తే బన్నీ సహా అవాక్కవ్వాల్సిందే. ఇప్పటిదాకా ఈ సినిమా సాధించిన వసూళ్లలో 40 శాతం తమిళం నుంచి వచ్చినవైతే.. 60 శాతం తెలుగు వెర్షన్ వాటా కావడం విశేషం. ఇంతకుముందు తెలుగులో సూర్య సినిమాలు బాగానే ఆడేవి కానీ.. తమిళంతో పోలిస్తే బన్నీ అన్నట్లు నిజంగానే తక్కువగా ఉండేవి. ఎన్నడూ 50 శాతానికి కూడా చేరింది లేదు. కానీ ‘24' ఏకంగా తమిళ వసూళ్లను దాటి తెలుుగలోనే ఎక్కువ కలెక్ట్ చేయడం సెన్సేషనలే. ఇప్పటిదాకా ఈ సినిమా రెండు భాషల్లో కలిపి 40 కోట్ల దాకా వసూళ్లు సాధించినట్లు అంచనా. తమిళంలో థియేటర్లు తక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజైంది. ఓపెనింగ్స్ రెండు భాషల్లోనూ దాదాపు సమానంగా వచ్చాయి. సూర్యకు ఇక్కడున్న క్రేజ్‌కు తోడు.. ఇష్క్, మనం లాంటి సినిమాలతో మన ప్రేక్షకులకు బాగా చేరువైన విక్రమ్ కుమార్ దర్శకుడు కావడం ‘24'కు బాగా కలిసొచ్చింది. ఇక్కడ ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రాగా.. తమిళంలో మాత్రం మరీ గొప్ప రెస్పాన్సేమీ రాలేదు. ఇంతకీ ఫైనల్‌గా ‘24' తెలుగు-తమిళ కలెక్షన్లు ఎంత వస్తాయో చూడాలి.

No comments:

Post a Comment