Wednesday, April 12, 2017

కూతురి బికినీ సీన్లకు తల్లి నో చెప్పింది..!

తన కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం గురించి చాలా జాగ్రత్తలే తీసుకుంటోంది అమ్రితా సింగ్. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అయిన అమ్రిత ఇప్పుడు కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీపై చాలా కసరత్తే చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్ ఆధ్వర్యంలో రూపొందే సినిమాతో సారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందనే ఊహాగానాలున్నాయి. కరణ్ వంటి మూవీ మేకర్ సినిమాతో కూతురిని తెరకు పరిచయం చేయడానికి ఉత్సాహంగానే ఉన్న సైఫ్ మాజీ భార్య.. కొన్ని షరతులను పెడుతోందట. అందులో ముఖ్యమైనది తన కూతురు బికినీలో కనిపించడానికి వీల్లేదు.. అనేది. సినిమాలో నటించడానికి ఓకే కానీ, తొలి సినిమాలోనే బికినీలో కూతురు అందాల ప్రదర్శనను అమ్రిత వ్యతిరేకిస్తోందట. అలాంటి సీన్లు వద్దు.. అని ఆమె స్పష్టం చేసిందని సమాచారం. దీంతో కరణ్ డైలమాలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. సైఫ్ ఇంటి నేపథ్యాన్ని బట్టి చూస్తే.. బికినీలు వేయడం వాళ్లకు కొత్తేమీ కాదు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ భారతీయ సినిమాలో బికినీ ధరించిన తొలి నటిగా గుర్తింపు పొందింది. అప్పట్లో అదో సంచలనం. ఇక సైఫ్ సోదరి సొహా అలీఖాన్ కూడా పలు సినిమాల్లో బికినీల్లో నటించింది. అయితే సైఫ్ కూతురు విషయంలో మాత్రం తల్లి వైపు నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కూతురు బికినీలో కనిపించడాన్ని ఈ మాజీ హీరోయిన్ ఇష్టపడటం లేదు. బికినీలో కచ్చితంగా నటించాలని అంటే.. కరణ్ సినిమాకు నో చెప్పడానిక కూడా అమ్రిత వెనుకాడటం లేదని సమాచారం.

No comments:

Post a Comment