Wednesday, April 12, 2017

బాబు హోటల్ బిల్లెంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్ముతాయి!

మూడేళ్ల కిందట ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్ లోని తన ఇంటిని కూల్చి కొత్తగానిర్మించుకునే క్రమంలో ఒక స్టార్ హోటల్ లో మకాం పెట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు విజయవాడ ప్రాంతంలో నూతనంగా తనకు ప్రభుత్వ ఖర్చుతోనే నివాసాన్ని ఏర్పరుచుకున్నారు చంద్రబాబు. అయితే కుటుంబం నివసించేందుకు అంటూ.. ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్ లో ని హోటల్ పార్క్ హయత్ లో మకాం పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించబడే రెండు గెస్టౌస్ లు కాక.. ఈ హోటల్ అకామడేషన్ అదనంగా ఉండింది. అయితే తాజాగా బాబు ఇంటి పని పూర్తి అయ్యింది. దాదాపు నూటా యాభై కోట్ల రూపాయలు వెచ్చించి చంద్రబాబు నూతనంగా ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటి గురించి చెప్పుకోవాల్సిన అబ్బురాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే.. హోటల్ పార్క్ హయత్ ను చంద్రబాబు కుటుంబం ఖాళీ చేయడంతో.. దాని బిల్లు గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. బాబు కుటుంబం కొన్ని నెలల పాటు అక్కడ నివసించింది. దీంతో రమారమీ ఇరవై కోట్ల రూపాయల బిల్లు అయ్యిందని టాక్. ఈ డబ్బు అంతా ఏపీ ప్రభుత్వ ఖాతా నుంచే చెల్లించాల్సి ఉంది. ఇన్ని రోజులూ హైదరాబాద్ లో సీఎం అధికారిక నివాసం హోటల్ పార్క్ హయత్ గా చలామణి అయ్యింది. ఐదు నక్షత్రాల హోటల్ లో బస చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా బాబు నిలిచారు. ఇప్పుడు ఖాళీ చేసిన క్రమంలో ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లించనున్నారని సమాచారం. మరి దీనిపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. కచ్చితమైన మొత్తం ఎంతో తెలుస్తోంది.

No comments:

Post a Comment