2017లో బిగ్గెస్ట్ హిట్ ఏదంటే సౌత్ నుంచి నార్త్ వరకు ఎవరైనా ‘బాహుబలి: ది
కంక్లూజన్’ అనేస్తారు. అందుకు వసూళ్లే నిదర్శనం. వసూళ్ల మాట పక్కన
పెట్టేసినా.. కంటెంట్ పరంగా కూడా ఇది బలమైన సినిమానే. ఐతే ఇంటర్నేషనల్ మూవీ
డేటా బేస్ సంస్థ ప్రకటించిన 2017 ఇండియన్ టాప్-10 మూవీస్ జాబితాలో మాత్రం
‘బాహుబలి: ది కంక్లూజన్’కు అగ్రస్థానం దక్కలేదు. ఈ చిత్రం రెండో స్థానంతో
సరిపెట్టుకుంది. మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో డైరెక్టర్ ద్వయం
గాయత్రి-పుష్కర్ రూపొందించిన తమిళ థ్రిల్లర్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమా ఈ
జాబితాలో అగ్రస్థానం సంపాదించడం విశేషం. అలాగని ఇది ఐఎండీబీ సంస్థ స్వయంగా
ప్రకటించిన జాబితా అనుకునేరు.
ఐఎండీబీ యూజర్స్ అయిన సామాన్య ప్రేక్షకుల రేటింగ్ ఆధారంగానే ఈ జాబితా ప్రకటించారు. ‘బాహుబలి-2’ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ను పక్కన పెట్టి సామాన్య ప్రేక్షకులు ‘విక్రమ్ వేద’ లాంటి రీజనల్ మూవీకి పట్టం కట్టడం విశేషం. ఇక ఈ జాబితాలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ కాకుండా ఇంకో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం విశేషం. సెన్సేషనల్ ‘అర్జున్ రెడ్డి’కి ఈ లిస్టులో మూడో స్థానం దక్కింది. రానా మూవీ ‘ఘాజీ’ ఆరో స్థానం సంపాదించింది. అమీర్ ఖాన్ నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్ నాలుగో స్థానంలో నిలవగా.. ఇర్ఫాన్ ఖాన్ మూవీ ‘హిందీ మీడియం’ ఐదో స్థానం సంపాదించింది. అక్షయ్ కుమార్ సినిమాలు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. ‘జాలీ ఎల్ఎల్బీ-2’ వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. విజయ్ ‘మెర్శల్’ మూవీ 9.. మమ్ముట్టి ‘ది గ్రేట్ ఫాదర్’ 10 స్థానాలు సాధించాయి.

No comments:
Post a Comment