వి.వి.వినాయక్ చివరగా తీసిన ‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్. అయినప్పటికీ
దీని తర్వాత అతడితో పని చేయడానికి పెద్ద స్టార్లెవరూ ముందుకు రాలేదు. పెద్ద
హీరోల కోసం చూసి చూసి.. చివరికి సాయిధరమ్ తేజ్‌తో సర్దుకుపోయాడు. ‘ఖైదీ
నంబర్ 150’ సక్సెస్ క్రెడిట్లో వినాయక్‌కు పెద్దగా క్రెడిట్ ఏమీ రాలేదన్నది
వాస్తవం. అది రీమేక్.. పైగా చిరు రీఎంట్రీ మేనియా దానికి కలిసొచ్చింది.
దాన్ని పక్కన పెట్టేసి చూస్తే గత కొన్నేళ్లలో వినాయక్‌కు సరైన సక్సెస్ లేదు. ‘ఖైదీ..’ కంటే ముందు తీసిన ‘అఖిల్’ పెద్ద డిజాస్టర్. దాని కంటే ముందు వచ్చిన ‘అల్లుడు శీను’ యావరేజ్. అంతకంటే ముందు వచ్చిన ‘నాయక్’ ఆ సమయానికి బాగానే ఆడింది. ఐతే ‘నాయక్’ తరహా సినిమాలు ఇప్పుడు తీస్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. ఆ తరహా ఫార్ములా.. రొటీన్ సినిమాలు ఇప్పుడు వర్కవుటయ్యే పరిస్థితి లేదు.
ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథలకు పట్టం కడుతుతున్నారు. భిన్నమైన సినిమాలు కోరుకుటున్నారు. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా వినాయక్ తీయగలడా అన్న సందేహాలున్నాయి. ఐతే తేజు-వినాయక్ సినిమాకు అనుకుంటున్న టైటిల్.. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఒక లుక్ చూస్తే మాత్రం ఇదేమైనా ‘నాయక్-2’నా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ‘ధర్మాభాయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ టైటిల్ చూస్తేనే అన్యాయాన్ని ఎదిరిస్తూ జనాల పక్షాన నిలబడే ఒక నాయకుడి కథ అనిపిస్తోంది. పైగా ‘నాయక్’ సినిమాలో చరణ్ లుక్‌ను తలపించేలా తేజు సోఫాలో కూర్చుని ఒక స్టిల్ బయటికి వచ్చింది.
ఈ టైటిల్.. ఆ లుక్ చూశాక.. వినాయక్ కొత్తగా ఏమీ ట్రై చేయట్లేదని.. తనకు అలవాటైన ఫార్ములా బాటలో సాగిపోతున్నాడని సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహాలే నిజమైతే మాత్రం కష్టమే. తేజు అసలే వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి టైంలో ఒక రొటీన్ సినిమాతో వస్తే మాత్రం అంతే సంగతులు. చూద్దాం మరి.. వినాయక్ ఏం చేశాడో?

No comments:
Post a Comment