Wednesday, December 13, 2017

సుమంత్ కు భలే ఛాన్స్ దొరికింది కానీ..?

ప్రస్తుతం థియేటర్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడట్లేదు. పేరుకు 10కి పైగా సినిమాలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఏదీ ప్రేక్షకుడ్ని ఎట్రాక్ట్ చేయడం లేదు. ఇలాంటి టైమ్ లో వచ్చింది మళ్లీ రావా సినిమా. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది.
ఓ హిట్ కోసం కళ్లుకాయలుకాచేలా ఎదురుచూస్తున్న సుమంత్ కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. అతడు నటించిన ఓ సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే పెద్ద విషయం. పైగా మార్కెట్లో పోటీలేని టైమ్ లో మంచి టాక్ వచ్చిందంటే అంతకంటే ఇంకేం కావాలి. కానీ సుమంత్ తో పాటు "మళ్లీ రావా" యూనిట్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది.
సరిగ్గా నెలరోజుల కిందట గరుడవేగ సినిమాకు ఇదే పరిస్థితి వచ్చింది. సక్సెస్ టాక్ వచ్చింది, పోటీ లేదు. వెంటనే 'రాజశేఖర్ అండ్ కో' రంగంలోకి దిగిపోయారు. ప్రమోషన్ తో, స్పెషల్ షోలతో ఊదరగొట్టారు. అది గరుడవేగకు బాగా పనికొచ్చింది. 'మళ్లీ రావా' విషయంలో మిస్ అయింది ఇదే.
ప్రస్తుతం సుమంత్ బ్యాచ్ కు ఉన్నది ఈ ఒక్క వీకెండ్ మాత్రమే. మళ్లీ రావా సినిమాను మరింత మంది దృష్టికి తీసుకెళ్లాలంటే వాళ్లకున్నది కొన్ని రోజులు టైమ్ మాత్రమే. సక్సెస్ తో పాటు లాభాలు అందుకోవాలంటే కష్టపడాల్సింది ఈ 3రోజులే. ఆ తర్వాత హలో, ఎంసీఏ లాంటి సినిమాలు వచ్చేస్తున్నాయి. సుమంత్ కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు.

No comments:

Post a Comment