చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను ఇబ్బందిపెట్టిన బన్నీ.. ఈసారి
ఏకంగా తన ఫ్యాన్స్ కే వార్నింగ్ ఇచ్చాడు. 'ఒక్క క్షణం' ప్రీ-రిలీజ్ ఈవెంట్
కు ప్రత్యేక అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. అభిమానులపై అసహనం
వ్యక్తంచేశాడు. వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు.
"ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం ఎదురు మాట్లాడ్డం సంస్కారం కాదు. మీరు
ఎంతయినా అరవండి. ఫంక్షన్ పెట్టేదే మీరు అరుస్తారని, కానీ ఓ మనిషి
మాట్లాడేటప్పుడు మాత్రం కాదు. నేను మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం వచ్చినా
వాళ్ల పేరు ఎత్తిమరీ చెబుతా. మీకు ఆ సంస్కారం ఉండాలి". ఇలా ఫ్యాన్స్ కు
చిన్న క్లాస్ పీకాడు బన్నీ.
ప్యాన్స్ కంట్రోల్ లో లేకపోతే నాకు కోపం వచ్చేస్తుందంటున్నాడు బన్నీ. ఎవరైనా వాళ్ల ఫీలింగ్ చెప్పుకునేటప్పుడు అడ్డం పడకూడదంటున్నాడు.
"మీ సంతోషం నాకు అర్థమౌతోంది. కానీ మాట్లాడేటప్పుడు అరుస్తుంటే నేను
హర్ట్ అయ్యాను. కొంచెం కోప్పడ్డాను. ఏవీ మనసులో పెట్టుకోవద్దు. ఇది
ఎప్పట్నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది."
అన్నాడు బన్నీ.
బన్నీ ఇలా రెచ్చిపోవడంతో పక్కనే ఉన్న అల్లు శిరీష్ దాన్ని కవర్ చేసే
ప్రయత్నం చేశాడు. "నా పేరు సూర్య" సినిమాలో సూర్య క్యారెక్టర్ ఇలా
మాట్లాడుతోందని.. బన్నీ కాదని కవర్ చేశాడు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే..
బన్నీ అరవొద్దని వార్నింగ్ ఇస్తుంటే ఫ్యాన్స్ మరింత అరిచి అతడ్ని ఇరిటేట్
చేశారు.
No comments:
Post a Comment