Tuesday, December 26, 2017

ఆ నాలుగు నిమిషాలు ఏమై వుంటుంది?

విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ యాక్టర్ కామియో రోల్ వేసారు అంటే అక్కడ రెండు పాయింట్లు వుంటాయి. అయితే మొహమాటానికి. లేదా కాస్తయినా ఇంపార్టెన్స్ వున్న పాత్ర కావడం. ప్రేమమ్ సినిమాలో ఆ మధ్య జస్ట్ వన్ టు టూ మినిట్ కామియో రోల్ చేసాడు. తన మేనల్లుడు నాగ చైతన్య సినిమా కాబట్టి. పైగా అక్కడ పాత్ర కూడా అలాగే సెట్ అయింది.
ఇప్పుడు పవన్-త్రివిక్రమ్ కాంబోలోని అజ్ఞాతవాసిలోని ఓ సీన్ లో వెంకీ కామియో రోల్ చేసాడు. జస్ట్ నాలుగు నిమిషాల పాత్ర అది. డైలాగులు వున్నాయి. డబ్బింగ్ కూడా చెప్పాడు వెంకీ. అయితే త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ ఏదో సినిమాకు బజ్ కోసమో, ప్లస్ కావడం కోసమో వెంకీని ఓ కామియో రోల్ లోకి తీసుకురాడు. సమ్ థింగ్ వుండి వుండాలి. ఆ సమ్ థింగ్ ఏమిటన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్.
అయితే వెంకీ పాత్ర కథతో సంబంధం వున్నది కాదనీ, జస్ట్ పాస్ ఆన్ కామియో క్యారెక్టర్ మాత్రమే అని వినిపిస్తోంది. కానీ తళుక్కున మెరిసే ప్రాధాన్యత వుంటుందని, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగు ఒకటి పడుతుందని తెలుస్తోంది. మల్లీశ్వరి తరువాత మళ్లీ ఇన్నాళ్లకు వెంకీ నోట త్రివిక్రమ్ పంచ్.. ఎలా వుంటుందో మరి.

No comments:

Post a Comment