రవితేజ-కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రకటన బయటకు వచ్చింది. ఒక విధంగా
చెప్పాలంటే కాస్త హడావుడికి బయటకు వచ్చినట్లు అనిపించింది. దీని వెనుక
కాస్త రీజన్ వుందనే తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో గుసగుసలు
వినిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ ఓ సినిమాను చైతన్య-వెంకటేష్ కాంబినేషన్ లో
చేయాల్సి వుంది.
కానీ అక్కడ ఎంతకూ తెగడం లేదు. నాగ్ చూస్తే ఫుల్ బిజీగా వున్నారు.
22తరువాత దాకా ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. మరోపక్క వెంకీ, చైతన్య వరుసగా
సినిమాలు ఓకే చేసి బిజీ అయిపోయారు. కళ్యాణ కృష్ణను అలా అబేయన్స్ లో
వుంచేసారు.
ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా వచ్చి చాలా రోజులు అయింది.
మరోపక్క రవితేజతో కళ్యాణ్ కృష్ణ సినిమా ఆలోచన ఇవ్వాళ నిన్నటిది కాదు.
సోగ్గాడే చిన్ని నాయనాకు ముందు నుంచే రవితేజ పరిచయం. ఓ సినిమా చేయాలని
ఇద్దరూ అనుకున్నారు. కానీ అది అలా వెనక్కు వెళ్తోంది.
ఇలాంటి టైమ్ లో ఇప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాం అంటే సురేష్ బాబు కాస్త
అభ్యంతరాలు చెప్పినట్లు తెలుస్తోంది. తమ ప్రాజెక్టు తేలకుండా వెళ్లవద్దని
అన్నట్లు వినికిడి. దీంతో నిర్మాతలు రామ్ తాళ్లూరి వగైరా ఓ దశలో కాస్త
వెనకడుగు వేసారని టాక్. సురేష్ బాబుతో సమస్య ఎందుకున్నది వారి ఆలోచన. అదే
టైమ్ లో కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో మరో నిర్మాతతో సినిమా చేద్దామని కూడా
రవితేజ ఆలోచించినట్లు తెలుస్తోంది.
కానీ ఈలోగా ఏమయిందో మరి, సడెన్ గా సినిమా ప్రకటన వదిలారు. మరి పంచాయతీలు
అన్నీ ముగిసినట్లేనా? లేక అసలు పంచాయతీలు చేయకుండా కాలయాపన చేస్తున్న
వైనాన్ని కట్ చేయడానికి ప్రకటన వదిలారా?అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు
డిస్కషన్ పాయింట్.
No comments:
Post a Comment