ఏదో టేబుల్ మీద కప్పు.. అక్కడ కింద హీరో నాని పేరు.. కప్పులో ఉన్న కాఫీలో
'అ' అనే అక్షరంతో ఒక సినిమా టైటిల్. ఇదంతా చూస్తే తన తొలిసినిమాను
ప్రొడ్యూస్ చేస్తున్న నాని.. ఒక చిన్న బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నాడని
అందరూ అనుకున్నారు. న్యాచురల్ స్టార్ కూడా దీన్నొక చిన్న సినిమా అన్న
తరహాలోనే చెప్పుకొచ్చాడు. కాని ఇప్పుడు రోజుకో పోస్టర్ ను చూస్తుంటే అలా
అనిపించట్లేదు.
సాధారణంగా చిన్న సినిమాలు అంటే.. వాటిని ఒక కోటి లేదా రెండు కోట్లలో తీస్తారు. వాటినే చిన్న సినిమాలు అంటారు. కాని నాని తీస్తున్న 'అ' సినిమా మాత్రం.. ఖచ్చితంగా లోబడ్జెట్ సినిమా తరహాలో కాకుండా.. టాప్ గ్రేడ్ సినిమా తరహాలో కనిపిస్తోంది. ఎందుకంటే సైంటిస్టుగా అవసరాల శ్రీనివాస్ లుక్.. అలాగే ఒక వైల్డ్ లేడీగా ఒళ్ళంతా టాటూలు వేసుకున్న రెజీనా కసాండ్ర లుక్ చూస్తుంటే.. ఇదేదో చిన్న సినిమా అని మాత్రం అనుకోలేం. ఖచ్చితంగా 10 కోట్లు పైనే పెట్టితీశారని అనిపిస్తోంది. మరి డైరక్టర్ తన తెలివితో అత్యంత తక్కువ బడ్జెట్ తో ఇలాంటి రిచ్ లుక్ తెప్పించుంటాడా? ఏమో చెప్పలేం.
అవయవ దానం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేస్తుండగా.. కాజల్.. ఈషా.. రెజీనా.. అవసరాల.. ఇతర పాత్రలను చేస్తున్నారు. ఇక నాని అండ్ మాస్ రాజా రవితేజ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. మనోళ్లు బాహుబలి సినిమా ప్రమోషన్ ప్లాన్ ఫాలో అయిపోతూ.. గత వారం రోజులుగా రెండు రోజులకో క్యారక్టర్ పోస్టర్జ్ ను జనాలకు పరిచయం చేస్తున్నారు. అది సంగతి.

No comments:
Post a Comment