Friday, December 15, 2017

ఇటు అనిరుధ్..అటు అనూప్..దేవికి బ్యాండే

గత రెండు దశాబ్దాల్లో తెలుగు సినిమా మ్యూజిక్ తీసుకుంటే.. దేవిశ్రీది తిరుగులేని ఆధిపత్యం. ఈ రెండు దశాబ్దాల్లో పదుల సంఖ్యలో స్టార్ హీరోల సినిమాలు చేశాడతను. అందులో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్లున్నాయి. తెలుగు సినిమాకు ఒక కొత్త తరహా ఎంటర్టైనింగ్ మ్యూజిక్ ను పరిచయం చేసిన సంగీత దర్శకుడు. కమర్షియల్ మ్యూజిక్ లోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ.. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ సాగిపోతున్నాడతను. ఐతే ఈ మధ్య మాత్రం దేవిశ్రీ మ్యూజిక్ కొంచెం రొటీన్ అయిపోతోందని.. అతను ఒక ఫార్మాట్లో సాగిపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి. దేవి నుంచి వచ్చిన కొత్త ఆల్బం ‘ఎంసీఏ’ అయితే ఏమాత్రం కొత్తదనం లేకుండా తయారరైంది. దేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నిరాశ పరిచింది.. విమర్శలెదుర్కొంది ఈ ఆల్బం విషయంలోనే.

దేవి ‘ఎంసీఏ’ ఆడియో విషయంలో డిజప్పాయింట్ చేసిన టైంలోనే అతడికి పోటీగా ఉన్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అదిరిపోయే ఆల్బంలతో వచ్చారు. అందులో ఒకరు అనూప్ రూబెన్స్. అతను సంగీతం అందించిన ‘హలో’ ఆల్బంకు అద్భుతమైన స్పందన వస్తోంది. విక్రమ్ కుమార్ తో ఇంతకుముందు ‘ఇష్క్’..  ‘మనం’ లాంటి మంచి ఆల్బంలు ఇచ్చిన అనూప్.. ఈసారి వాటికి ఏమాత్రం తగ్గని రీతిలో మంచి ఫీల్ ఉన్న.. రిఫ్రెషింగ్ ఆడియో ఆల్బంతో వచ్చాడు. ఇందులోని పాటలన్నీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు దేవిని కాదని త్రివిక్రమ్ ‘అజ్నాతవాసి’ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్న అనిరుధ్.. అదిరిపోయే ఔట్ పుట్ తోనే వస్తున్నట్లున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘బైటికెళ్లి చూస్తే’.. ‘గాలి వాలుగా’.. పాటలు రెండూ ఇన్ స్టంట్ గా హిట్టయ్యాయి. ఈ సినిమా ఫుల్ ఆడియో ఆల్బం కూడా చాలా బాగా వచ్చిందని.. ఇది సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి దేవి వీక్ ఆడియో ఇచ్చిన సమయంలోనే ఇటు అనూప్.. అటు అనిరుధ్ అదిరిపోయే పాటలతో అతడిని ఇరుకున పెట్టారు. ఇక ‘రంగస్థలం’.. ‘భరత్ అను నేను’ ఆడియోలతో దేవి మళ్లీ తన ముద్ర చూపించకుంటే.. అతడికి మున్ముందు కష్టమే అవుతుంది.

No comments:

Post a Comment