న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు, తారలంతా విదేశాలకు చెక్కేస్తుంటారు. ఎవరు ఏ
దేశం వెళ్తున్నారో కూడా అర్థం కాదు. ఈ 4-5రోజులు ఎవ్వరూ కనిపించారు. ఈ
ఏడాది స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లకైతే ఈ ఎంజాయ్ మెంట్ ఇంకాస్త
ఎక్కువే. ఈ లిస్ట్ లో అందరికంటే ముందుంది పూజా హెగ్డే.
దువ్వాడజగన్నాధమ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే.. ఈసారి నూతన
సంవత్సర వేడుకల కోసం బ్రిటన్ ను సెలక్ట్ చేసుకుంది. మాంచెస్టర్ లో న్యూ
ఇయర్ ను ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసి,
తన నిర్మాతలకు సమాచారం అందించింది పూజా.
ప్రస్తుతం ఈ బ్యూటీ, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యం అనే సినిమాలో
నటిస్తోంది. రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్ చేస్తోంది. ఈ
రెండు ప్రాజెక్టుల తర్వాత కొత్త ఏడాదిలో మహేష్ బాబు సరసన నటించనుంది పూజా
హెగ్డే.
No comments:
Post a Comment