సీక్రెట్ అంటూ ఈమధ్య ఓ ప్రకటన చేశాడు బన్నీ. తన కొత్త సినిమాకు
సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ ను జనవరి 1న విడుదల చేయబోతున్నట్టు తెలిపాడు.
ఫస్ట్ ఇంపాక్ట్ అంటే ఏంటనేది అప్పట్లో చాలామందికి అర్థంకాలేదు. ఫస్ట్ లుక్
వస్తోందా లేక టీజర్ వస్తుందా అనే అనుమానాలు ఉండేవి. ఫైనల్ గా దీనిపై ఓ
క్లారిటీ వచ్చింది.
బన్నీ కొత్త సినిమాకు సంబంధించి టీజర్ వస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్ కింద
80సెకెన్ల టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం దీని వర్క్
నడుస్తోంది. ఇందులో బన్నీ మాత్రమే కనిపిస్తాడు. డైలాగ్ కూడా ఉండదు.
సినిమా ఏ జానర్ కు చెందుతుంది.. అందులో బన్నీ ఎలా ఉండబోతున్నాడనే
అంశాలపైనే ఫోకస్ పెడుతూ ఈ టీజర్ ను కట్ చేస్తున్నారు. నిజానికి యూనిట్
దృష్టిలో ఇది టీజర్ కూడా కాదు. అసలైన టీజర్ కు సినిమా విడుదలకు ముందు
ప్రమోషన్ లో భాగంగా విడుదల చేయబోతున్నారు. అందుకే దీనికి 'ఫస్ట్ ఇంపాక్ట్'
అనే పేరుపెట్టారు.
వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే యాక్షన్
సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ కోసం ఫారిన్ ట్రైనర్ ను హైదరాబాద్ కు
రప్పించి మరీ మేకోవర్ అయ్యారట. హెయిర్ స్టయిల్ లో కూడా మార్పులు
తీసుకొచ్చారు. ఆ లుక్ ను మాత్రమే 'ఫస్ట్ ఇంపాక్ట్' కింద రిలీజ్
చేయబోతున్నారు.
No comments:
Post a Comment