Saturday, December 16, 2017

అజ్ఞాతవాసి టీజర్ లో ఏముంది?

టీజర్ రాకముందే ట్రెండింగ్ లో నిలిచింది అజ్ఞాతవాసి. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీఇన్నీ కావు. దీనికి తోడు రీసెంట్ గా రిలీజైన 'గాలివాలుగా' సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో టీజర్ పై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో విడుదలకానున్న టీజర్ లో ఏముందనే చర్చ కూడా ఊపందుకుంది.
అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ సందర్భంగా గతంలో టీజర్ కోసం త్రివిక్రమ్ అనుసరించిన ఫార్ములాస్ పై చర్చిస్తున్నారు నెటిజన్లు. వీళ్లిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అత్తారింటికి దారేది, జల్సా సినిమా టీజర్స్ లో కేవలం పవన్ ఎప్పీయరెన్స్ పై ఫోకస్ పెట్టాడు త్రివిక్రమ్.
అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పవన్ ను స్టయిలిష్ గా చూపించాడు. ఎలాంటి డైలాగ్స్ పెట్టలేదు. సో.. ఈసారి కూడా అజ్ఞాతవాసి కోసం అదే పద్ధతి ఫాలో అయ్యే అవకాశం ఉంది.
తన రీసెంట్ మూవీ 'అ ఆ' విషయంలో మాత్రం రూటు మార్చాడు త్రివిక్రమ్. సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ ఇచ్చే విధంగా టీజర్ కట్ చేశాడు. అందులో డైలాగ్స్ ఉన్నాయి. సో.. అజ్ఞాతవాసి టీజర్ లో కూడా టైటిల్, థీమ్ ఎలివేట్ అయ్యేలా డైలాగ్ ఉండే అవకాశం ఉందంటోంది మరో సెక్షన్. ఎటొచ్చి ఈ టీజర్ పై చర్చ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది.

No comments:

Post a Comment