Friday, December 15, 2017

నిజమా.. ఎన్టీఆర్ రికార్డును సూర్య కొట్టేశాడా?

నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త కలకలం రేపుతోంది. తమిళ కథానాయకుడు సూర్య.. ఎన్టీఆర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేశాడట. తెలుగులో ఇప్పటిదాకా 24 గంటల్లో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న టీజర్‌ రికార్డును సూర్య కొత్త సినిమా ‘గ్యాంగ్’ సొంతం చేసుకుందట.

బుధవారం సాయంత్రం లాంచ్ అయిన ఈ టీజర్.. 24 గంటల వ్యవధిలో 2.03 లక్షల లైక్స్ తెచ్చుకుంది. దీనికి 24 గంటల్లో 10 లక్షల వ్యూస్ రాగా.. లైక్స్ ఏకంగా 2 లక్షల మార్కును దాటడం అనూహ్యమే. ఇప్పటిదాకా ఏ తెలుగు టీజర్‌కూ 24 గంటల్లో ఇన్ని లైక్స్ రాలేదన్నది సోషల్ మీడియా వర్గాల అంచనా.

ఇప్పటిదాకా ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ టీజర్ 24 గంటల్లో 1.92 లైక్స్ కొట్టించుకుని రికార్డు నెలకొల్పింది. మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ 24 గంటల్లో 1.9 లక్షల లైక్స్‌తో తర్వాతి స్థానంలో ఉండగా.. పవన్ మూవీ ‘కాటమరాయుడు’ టీజర్ ఒక్క రోజులో 1.46 లక్షల లైక్స్‌‌తో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

ఈ టాలీవుడ్ స్టార్లందిరినీ దాటేసి సూర్య నటించిన డబ్బింగ్ సినిమా టీజర్ సూర్య తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులో అతడికి మంచి ఫాలోయింగే ఉంది. అతడి సినిమాలు తమిళంలో మాదిరే తెలుగులోనూ బాగా ఆడుతుంటాయి. అతడికిక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. ఐతే తమిళంలో విడుదలైన మూడు వారాలకు తెలుగులో రిలీజైన‘గ్యాంగ్’ టీజర్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం మాత్రం అనూహ్యమే.

No comments:

Post a Comment