Tuesday, December 19, 2017

దిల్ రాజుతో పవన్ అలా అన్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఎప్పటికైనా ఒక సినిమా తీయాలన్నది తన డ్రీమ్ అంటూ అగ్ర నిర్మాత దిల్ రాజు గతంలో ఒకటికి రెండుసార్లు ప్రకటించాడు. ఐతే పవన్ వచ్చే ఏడాది నుంచి తాను సినిమాల్లోనే నటించనంటున్నాడు. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు సినిమాలకు టాటా చెప్పేస్తానని.. మళ్లీ సినిమాల వైపు చూడనని ఈ మధ్యే మరోసారి నొక్కి వక్కాణించాడు పవన్. ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్లు పూర్తి చేయడమే పవన్ కు కష్టంగా ఉంది కాబట్టి.. ఇక దిల్ రాజుతో ఎప్పటికీ సినిమా చేయకపోవచ్చని.. ఆయన కల నెరవేరకపోవచ్చని అనుకున్నారు. కానీ దిల్ రాజు మాత్రం పవన్ తో సినిమా చేయడానికి దారులు మూసుకుపోలేదన్నట్లుగా మాట్లాడుతుండటం విశేషం.

ఈ మధ్యే తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. తనతో సినిమా చేసే విషయంలో పవన్ ఒక హామీ ఇచ్చాడని రాజు వెల్లడించాడు. మంచి స్క్రిప్టుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దగ్గరికి రావచ్చని.. తన రాజకీయాలు.. తన కమిట్మెంట్లు అవన్నీ సంబంధం లేదని.. తాను సినిమా చేస్తానని పవన్ తనతో అన్నాడని రాజు చెప్పడం విశేషం. సరైన సమయం వచ్చి.. మంచి సబ్జెక్ట్ దొరికితే పవన్‌తో తప్పకుండా సినిమా చేస్తానని రాజు అన్నాడు. మరి ఓవైపు రాజకీయ సభలో మాట్లాడుతూ.. తాను పార్ట్ టైం పొలిటీషయన్ కాదని.. తాను ఇక సినిమాలు చేయబోనని.. శాశ్వతంగా సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటన చేసిన పవన్.. దిల్ రాజుకు మాత్రం ఇలాంటి హామీ ఎలా ఇచ్చాడబ్బా?

No comments:

Post a Comment