Thursday, December 21, 2017

నానిది బ్రేకుల్లేని బండేనా?

2014 మార్చిలో విడుదలైన ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెడితే.. ఈ ఏడాది జులైలో వచ్చిన ‘నిన్ను కోరి’ వరకు నానికి ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మధ్యలో ‘మజ్ను’ ఒక్కటి యావరేజ్‌గా ఆడింది. మిగతా సినిమాలన్నీ సక్సెస్ అయినవే. అందులో కొన్ని హిట్లున్నాయి. కొన్ని సూపర్ హిట్లున్నాయి. ఇంకొన్ని బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. సక్సెస్ రేట్ చాలా తక్కువైన ఫిలిం ఇండస్ట్రీలో ఇంత నిలకడగా.. వరుసగా హిట్లు కొట్టడం అన్నది మామూలు విషయం కాదు. ఈ ఏడాది ‘నేను లోకల్’ లాంటి బ్లాక్ బస్టర్.. ‘నిన్ను కోరి’ లాంటి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు నాని. ఇప్పుడు ‘ఎంసీఏ’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరి నాని విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందా.. బ్రేక్ పడుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారందరూ.

గత రెండు మూడేళ్లలో యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా తన పెర్ఫామెన్స్‌తో లాక్కొచ్చేశాడు నాని. ‘ఎంసీఏ’ టీజర్, ట్రైలర్ చూస్తే కంటెంట్ పరంగా అది కొత్తగా.. అంత గొప్పగా ఉంటుందన్న అంచనాలేమీ కలగలేదు. రొటీన్ ప్లాట్‌తోనే ఎంటర్టైన్ చేసే ప్రయత్నం జరిగినట్లుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఏమేరకు వర్కవుటవుతుందన్నదే కీలకం. సినిమాకు నాని సగం బలం అనడంలో సందేహం లేదు.

 ఓ మోస్తరుగా టైంపాస్ చేస్తూ నడిచిపోయినా సినిమా గట్టెక్కేస్తుంది. మరి వేణు శ్రీరామ్ సినిమాను ఎలా తీసుకెళ్లాడో చూడాలి. శ్రీరామ్ తొలి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ను దృష్టిలో పెట్టుకుని చూస్తే అతను అద్భుతాలేమీ చేస్తాడన్న అంచనాల్లేవు. ఐతే నిర్మాత దిల్ రాజు మాత్రం అతడిపై.. ‘ఎంసీఏ’పై భరోసాతో ఉన్నాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే.. ఓవర్లో ఆరో బంతికి కూడా సిక్సర్ కొట్టేస్తున్నా అంటున్నాడు. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఎంసీఏ’కు ఎలాంటి టాక్ వస్తుందో.. దీని వసూళ్లెలా ఉంటాయో చూద్దాం.

No comments:

Post a Comment