Wednesday, July 3, 2019

మోహన్ బాబు టైటిల్.. కళ్యాణ్ రామ్ తీసుకున్నాడా?

మోహన్ బాబు ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు విష్ణు ‘రావణ’ పేరుతో ఒక భారీ చిత్రం తీయాలనుకున్నాడు. చాలా ఏళ్ల కిందటే దీని బడ్జెట్ రూ.100 కోట్లుగా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఎందుకోగానీ వర్కవుట్ కాలేదు. ఐతే ‘రావణ’ పేరుతో మంచు వాళ్లు తీయాలనుకున్నది నిజంగా రావణుడి కథనే. ఐతే ఈ సినిమా పక్కకు వెళ్లిపోయినప్పటికీ.. టైటిల్ మాత్రం ఇప్పుడు వేరే సినిమాకు ఉపయోగపడుతోంది.

స్ట్రైకింగ్‌గా అనిపించే ఈ టైటిల్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇంతకుముందు అల్లు శిరీష్ హీరోగా ఒక సినిమాకు రంగం సిద్ధం చేసుకుని.. ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో సైలెంట్ అయిపోయిన మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

మల్లిడి వశిష్టగా పేరు మార్చుకున్న వేణు.. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం చేయనున్నాడు. దీనికి ముందు ‘తుగ్లక్’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ అది పెడితే సీరియస్నెస్‌ పోతుందనే ఉద్దేశంతో ‘రావణ’గా మార్చారట. మరి ఈ టైటిల్ మంచు వాళ్లు రిజిస్టర్ చేయించారా లేదా.. వాళ్ల నుంచి వీళ్లు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది తెలియదు.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కబోయే చిత్రంగా ‘రావణ’ను చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ ఏడాదే ‘118’తో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. దీని తర్వాత అతను ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ల ప్రొడక్షన్లో ఇటీవలే ఆ చిత్రం పట్టాలెక్కింది. దాని తర్వాత ‘రావణ’ సెట్స్ మీదికి వెళ్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment